Chiranjeevi : మెగాస్టార్ 153, 154 టైటిల్స్ అదిరిపోయాయి..!
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే ప్రతీ ఒక్కరికి ముందు సినిమా టైటిల్ ఏంటని ఆసక్తికరంగా మాట్లాడుకుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. అన్నయ్య సినిమాలో మాస్ ఎలిమెంట్స్.. డాన్స్.. ఫైట్స్ గురించి మాట్లాడుకునే అభిమానులు ఆయన సినిమా టైటిల్స్ గురించి ప్రత్యకంగా చర్చించుకంటారు. దాదాపు పదేళ్ళ గ్యాప్ తర్వాత ఖైదీ నంబర్ 150 సినిమాతో ఎంత గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టి తన స్టామినా బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేశారు. ఇక ఈ సినిమా తర్వాత పాన్ ఇండియన్ రేంజ్ లో సైరా సినిమా చేసి పాన్ ఇండియన్ స్టార్ గా మారిపోయాడు.
ఇక కెరీర్ లో 152 గా ఆచార్య సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సక్సస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా రీసెంట్ గా కంప్లీట్ అయింది. మెగా పవర్ స్టార్ రాం చరణ్ కామ్రేడ్ సిద్ద పాత్రలో కనిపించబోతుండగా భారీ మల్టీస్టారర్ గా రూపొందుతున్న ఈ సినిమా మీద భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ కి జంటగా కాజల్ అగర్వాల్, చరణ్ కి జంటగా పూజా హెగ్డే నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మే 13న దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Chiranjeevi 153 and 154 Movie Titles Fixed
Chiranjeevi : మెగాస్టార్ 153 కి ‘రారాజు’..154 కి ‘వీరయ్య’ టైటిల్స్ ఫిక్స్..?
ఇక ఈ సినిమా పూర్తి చేసిన మెగాస్టార్ తన 153, 154 లను సెట్స్ మీదకి తీసుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలో వచ్చే నెల ఉగాది పండుగ సందర్భంగా మలయాళ సూపర్ హిట్ సినిమా తెలుగు రీమేక్ ని మొదలు పెట్టబోతున్నారు. ఈ సినిమా మెగాస్టార్ కెరీర్ లో 153గా తెరకెక్కబోతుండగా ‘రారాజు’ అన్న టైటిల్ ని మేకర్స్ పరిశీలిస్తున్నారట. ఈ
సినిమాను సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ – సూపర్ గుడ్ ఫిలిమ్స్ – ఎన్‌విఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్‌పై ఆర్ బి చౌదరి, ఎన్ వి ప్రసాద్ నిర్మించనున్నారు. అలాగే యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ తన 154 చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ‘వీరయ్య’ అన్న టైటిల్ ని రిజస్టర్ అయించినట్టు తాజా సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. త్వరలో మెగాస్టార్ 153,154 సినిమాల టైటిల్స్ ని అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది.