Tenmar Mallana : తీన్మార్ మల్లన్న నీ పోరాటం వృదా కాలేదు
Tenmar Mallana : తెలంగాణలో జరిగిన రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా అధికార టీఆర్‌ఎస్ పార్టీ విజయాన్ని సొంతం చేసుకుంది. హైదరాబాద్ నియోజక వర్గంలో బీసీపీ సీటును గెలుచుకునేందుకు కేసీఆర్ టీమ్ చాలా కష్టపడ్డట్లుగా అనిపించింది. ఇక నల్లగొండ ఎమ్మెల్సీ సిట్టింగ్ స్థానంను కూడా నిలుపుకునేందుకు కేసీఆర్ అండ్ టీమ్ చాలా అంటే చాలా కష్టపడ్డారు. నల్లగొండలో టీఆర్ఎస్ కు చుక్కలు చూపించింది పెద్ద రాజకీయ పార్టీ అభ్యర్థి కాదు అలా అని తెలంగాణ ఉద్యమ సమయంలో మొత్తం రాష్ట్రంను ఏకతాటిపైకి తీసుకు వచ్చిన కోదండరాం సారు కూడా కాదు. సోషల్ మీడియాలో ప్రతి రోజు కనిపించే తీన్మార్ మల్లన్న. ఇండిపెండెంట్ గా పోటీ చేసిన తీన్మార్ మల్లన్న ఒకాకొన సమయంలో గెలుపు ఖాయం అన్నట్లుగా దూసుకు పోయాడు. కాని అనూహ్యం పరిణామాలతో స్వల్ప తేడాతో ఓడి పోయాడు.
Tenmar Mallana : స్ఫూర్తిదాయక పోరాటం..
తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం కోసం ముందు నుండే ఒంటరి పోరాటం చేస్తూ వచ్చాడు. నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో యాత్ర నిర్వహించి అక్కడి సమస్యలను తెలుసుకుని యువకులతో చర్చించి వాటి పరిష్కారం కోసం సలహాలు సూచనలు చేస్తూ ప్రభుత్వం పై కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. కోట్లు ఖర్చు పెట్టేందుకు వెనుక ఎవరు లేరు అయినా తన వంతు ప్రయత్నంను చేసి అద్బుతంగా ప్రభావం చూపించాడు. ఎన్నికల్లో పోటీకి కోట్లు అవసరం లేదు అని యువతలో స్ఫూర్తిని నింపాడు అనడంలో సందేహం లేదు.

mlc candidate tenmar mallana social medai star
Tenmar Mallana : సోషల్ మీడియా ప్రభావం..
తీన్మార్ మల్లన్న ఈ రేంజ్ లో ఓట్లను దక్కించుకుని అధికార సిట్టింగ్ అభ్యర్థికి చుక్కలు చూపించాడు అంటే కారణం అది ఖచ్చితంగా సోషల్ మీడియా అనడంలో సందేహం లేదు. సోషల్ మీడియాలో అభిమానులతో మరియు ప్రజలతో మమేకం అవ్వడం వల్ల ఖచ్చితంగా ప్రభావం చూపించవచ్చు అని తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ నిరూపించాడు. తీన్మార్ మల్లన్న ఓడిపోయినా కూడా ఆయన గురించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రధాన పార్టీలు ఆయన్ను తమ పార్టీలోకి రావాలంటూ ఆహ్వానిస్తున్నాయి. ఆయన పోరాటంను స్ఫూర్తిగా తీసుకుని ఎంతో మంది రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఆయన పోరాటం వృదా అవ్వలేదు అనిపిస్తుంది.