janasena : తెలంగాణలో కాదు.. మొదట ఏపీలో జనసైనికులను చూసుకో పవన్
janasena : ఏపీలో జరిగిన 2019 అసెంబ్లీ మరియు పార్లమెంటు ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేక పోయిన జనసేన పార్టీ పై జనాల్లో నమ్మకం తగ్గుతుంది. ఇలాంటి సమయంలో పవన్ ఏపీలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూ అక్కడి ఓటర్లకు నమ్మకం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పవణ్ కళ్యాణ్ ఈ సమయంలో ఏపీపై శ్రద్ద పెడుతూనే మరో వైపు సినిమాలు కూడా చేస్తున్నాడు. సినిమాలు చేస్తూ ఏపీ రాజకీయాలను చేస్తున్న పవన్ ఇటీవల తెలంగాణలో కూడా జనసేన పార్టీని బలోపేతం చేస్తానంటూ ప్రకటించాడు. తాజాగా ఆయన చేసిన ప్రకటన పై రకరకాలుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున ఆయనకు తెలంగాణలో అభిమానులు ఉన్న మాట వాస్తవమే అయినా కూడా పార్టీకి ఆధరణ దక్కడం కష్టం అంటున్నారు.
janasena : తెలంగాణలో స్కోప్ లేదు..
తెలంగాణలో ప్రస్తుతం జనసేన పార్టీకి పెద్దగా స్కోప్ లేదు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ టీఆర్‌ఎస్ పార్టీ ని ఢీ కొట్టేందుకు కాంగ్రెస్ మరియు బీజేపీలు పోటీ పడుతున్నాయి. ఈ రెండు పార్టీలు కూడా టీఆర్‌ఎస్ ను బలంగానే ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి సమయంలో కొత్త పార్టీ వస్తే నాల్గవ లేదా అయిదవ స్థానంలో నిలవాల్సిందే తప్ప ఇప్పటికప్పుడు గొప్ప అద్బుతాలు సృష్టించడం ఏమీ జరుగదు. కనుక జనసేన ను తెలంగాణలో ఏదో సాధించేందుకు బలోపేతం చేసేందుకు ప్రయత్నించడం ఏమాత్రం సరైన నిర్ణయం కాదనే అభిప్రాయంను రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలో ప్రస్తుతం పార్టీ బలోపేతంకు కీలకం..
ఏపీలో వైకాపా ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలు అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సమయంలో తెలుగు దేశం పార్టీ ని కూడా ప్రజలు పెద్దగా పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే కాస్త కష్టపడి ఏపీ ప్రజల్లో నమ్మకం సాధిస్తే తప్పకుండా మంచి జరుగుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని తెలుసుకోవాలంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో తెలంగాణలో పార్టీని బలోపేతం అంటూ అక్కడ ఇక్కడ రెండు పడవల ప్రయాణం చేయడం ఏమాత్రం సబబు కాదు అంటూ జనసేన కార్యకర్తలు కూడా పవన్ ను హెచ్చరిస్తున్నారు. పవన్ తీసుకునే నిర్ణయాలు పార్టీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మరి పవన్ కొత్త నిర్ణయం ఏ మేరకు ఈ సారి ప్రభావం చూపించబోతుంది అనేది చూడాలి.