Rahul Gandhi : తస్మాత్‌ జాగ్రత్త.. ఇప్పుడు కాకుంటే మళ్లీ ఎప్పుడు కావు రాహుల్‌ గాంధీ | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Rahul Gandhi : తస్మాత్‌ జాగ్రత్త.. ఇప్పుడు కాకుంటే మళ్లీ ఎప్పుడు కావు రాహుల్‌ గాంధీ

Rahul Gandhi : దేశంలో మోడీ ప్రభుత్వంకు ఏడు ఏళ్లు నిండబోతున్నాయి. ఈ ఏడేళ్ల కాలంలో మోడీ ప్రభుత్వం తీసుకు వచ్చిన విధానాలు ఎన్నో సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేశాయి. ఇంకా గురి చేస్తూనే ఉన్నాయి. మోడీ పాత పద్దతులకు పాతర వేయాలనే ఉద్దేశ్యంతో చాలా కొత్త చట్టాలను తీసుకు వచ్చారు. దేశం ఇంకా అభివృద్ది చెందే దశలోనే ఉండి పోకుండా అభివృద్ది చెందింది అనిపించుకోవాలంటే కొత్త చట్టాలు రావాల్సిందే అంటూ కొన్ని సామాన్యులకు భారంగా […]

 Authored By himanshi | The Telugu News | Updated on :19 February 2021,10:40 am

Rahul Gandhi : దేశంలో మోడీ ప్రభుత్వంకు ఏడు ఏళ్లు నిండబోతున్నాయి. ఈ ఏడేళ్ల కాలంలో మోడీ ప్రభుత్వం తీసుకు వచ్చిన విధానాలు ఎన్నో సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేశాయి. ఇంకా గురి చేస్తూనే ఉన్నాయి. మోడీ పాత పద్దతులకు పాతర వేయాలనే ఉద్దేశ్యంతో చాలా కొత్త చట్టాలను తీసుకు వచ్చారు. దేశం ఇంకా అభివృద్ది చెందే దశలోనే ఉండి పోకుండా అభివృద్ది చెందింది అనిపించుకోవాలంటే కొత్త చట్టాలు రావాల్సిందే అంటూ కొన్ని సామాన్యులకు భారంగా నిలిచిన చట్టాలను తీసుకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రజలు ఆయన పరిపాలనపై తీవ్ర స్థాయిలో అసంతృప్తితో ఉన్నారు. ఈ అసంతృప్తి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. కాని వీరిపై అసంతృప్తి ఉన్న సమయంలో అవతలి వారు బలంగా అంటే ప్రతిపక్షం ప్రభావం చూపినట్లయితేనే ఆ వ్యతిరేకత అనేది ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుంది.

Rahul Gandhi : రాహుల్‌ గాంధీ టీం ఇంకా మేలుకోవడం లేదు..

ఒక వైపు ప్రజల్లో మోడీ పాలనపై వ్యతిరేకత మొదలు అయ్యింది. కాని దాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు రాహుల్‌ గాందీ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న కార్యక్రమాలు ఏమీ లేవనే చెప్పాలి. కొన్ని ఉద్యమాలకు మద్దతు తెలుపుతున్నారు తప్ప కేంద్రంపై రాహుల్‌ గాంధీ ఉద్యమం చేస్తున్న దాఖలాలు అయితే కనిపించడం లేదు. వీరు ఏం చేసినా కూడా జనాలు కనీసం స్పందించే తీరు పరిస్థితి లేదు. రాహుల్‌ గాంధీని జనాలు అసలు మోడీకి పోటీగానే భావించడం లేదు. కనుక ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది ఖచ్చితంగా రాహుల్‌ గాంధీ దక్కించుకోవడంలో విఫలం అవుతున్నాడు అంటూ విమర్శలు వస్తున్నాయి.

this is the time for congress and rahul gandhi for next elections

this is the time for congress and rahul gandhi for next elections

Rahul Gandhi : కాంగ్రెస్‌కు సరైన అవకాశం.. రాహుల్‌ గాంధీ

పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు వందకు చేరడం, వ్యవసాయ చట్టాలు, నిత్యావసరాల రేట్లు విపరీతంగా పెరగడం, గ్యాస్‌ ధర వెయ్యికి చేరడం ఇంకా సామాన్యుల నడ్డి విరిచే విధంగా మోడీ ప్రభుత్వం ఎన్నో ఎన్నెన్నో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంది. ఈ మొత్తం వ్యవహారంలో బీజేపీపై ప్రజలకు కోపంగానే ఉంది. కాని ఒకరు సరిగా లేని సమయంలో మరొకరి వైపు చూస్తే అసలు అక్కడ అంతకు మించి లోటు కనిపించినప్పుడు ఉన్నదానితోనే సరిపెట్టుకుంటారు కదా అందుకే బీజేపీనే కొనసాగించేందుకు జనాలు ఆసక్తి చూపిస్తారు. ఎన్నికలకు ఇంకా మూడు ఏళ్ల సమయం ఉంది. కనుక ఈ మూడు ఏళ్లలో ప్రజలకు మోడీ ప్రభుత్వం నుండి విముక్తి కలిగించి తాము సామాన్యుల కోసం అద్బుతాలు సృష్టించకున్నా వారికి ఇబ్బందులు లేకుండా పరిపాలన కొనసాగిస్తాం అంటూ హామీ ఇవ్వగలిగితే మాత్రం వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి తప్ప రాహుల్‌ గాంధీ ముందు ముందు మళ్లీ కేంద్రంలో అధికారంలోకి రావడం కష్టం అవుతుంది. మోడీ మరింతగా కుదురుకు కుంటే కాంగ్రెస్‌ ను మరింతగా పీకి అవతల పారేయడం ఖాయం.

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది