Pawan Kalyan : లబో దిబో అంటున్న పవన్ కళ్యాణ్ జనసేన సపోర్టర్లు !
Pawan Kalyan : అయ్యో దేవుడా.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. అయితే అటు సినిమాల్లో ఉన్నట్టు కాదు.. ఉంటే ఇటు రాజకీయాల్లో ఉన్నట్టు కాదు. రెండు పడవల మీద ప్రయాణం ఎప్పటికీ ప్రమాదమే అని జనసేన అధినేతకు ఎప్పుడు తెలుస్తుందో? ఆయన చివరకు ఏమైపోతారో అని జనసైనికులే భయపడిపోతున్నారు. పవన్ వైఖరి ఇలా ఉండటం వల్లనే జనసేనతో పొత్తు పెట్టుకున్న బీజేపీ పార్టీ వాళ్లను పట్టించుకోవడం లేదు. మరోవైపు పొత్తు పెట్టుకుంటాం అంటూ చెప్పుకొస్తున్న టీడీపీ కూడా ఈయన ప్రవర్తన వల్ల పక్కన పెట్టేసింది.
మిత్ర పక్షాలుగా భావిస్తున్న బీజేపీ ఒకవైపు, టీడీపీ మరోవైపు రెండు పార్టీలు కూడా పవన్ కు విలువ ఇవ్వడం లేదు. దీంతో ఏం చేయాలో పవన్ కు పాలుపోవడం లేదు. మరోవైపు బీజేపీ పట్టించుకోకున్నా కూడా పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీతో మిత్రపక్షంగానే ఉంటున్నారు. అలాగే.. చంద్రబాబుతో భేటీ అవుతూ.. పొత్తు కోసం వెంపర్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ చేష్టలు ఎలా ఉన్నాయంటే.. చివరకు బీజేపీ హైకమాండ్ అపాయింట్ మెంట్ కూడా పవన్ కు దొరకడం లేదు. అవును.. చాలా రోజుల నుంచి ఢిల్లీలో మకాం వేసిన పవన్ కళ్యాణ్.. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ.. ఆయనకు దొరకడం లేదు.
Pawan Kalyan : చంద్రబాబు కూడా పవన్ ను లైట్ తీసుకున్నారా?
మరోవైపు పొత్తు పొత్తు అంటూ కలిసి తిరుగుతున్న చంద్రబాబు కూడా పవన్ ను లైట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఒకప్పుడు జనసేనతో పొత్తు కోసం చంద్రబాబు తెగ ప్రయత్నాలు చేశారు కానీ.. పవన్ కళ్యాణ్ వైఖరి వల్ల ఎందుకో జనసేన మీద అంత ఆసక్తిగా లేనట్టు కనిపిస్తోంది. కానీ.. బీజేపీతో పొత్తు కోసం మాత్రం చంద్రబాబు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ఇటీవల ఢిల్లీకి వెళ్లారు. నిజానికి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుతో చంద్రబాబుకు కొంతలో కొంత ఆత్మవిశ్వాసం వచ్చింది. జనసేనతో పెద్దగా పనిలేదని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రతిపక్షాలన్నీ ఏకమై.. వైసీపీని ఓడించాలని చెప్పుకొచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు పొత్తుల గురించి మాట్లాడకపోవడం వెనుక పవన్ కళ్యాణ్ వైఖరే అని అంటున్నారు జనాలు.