Ys Jagan : పవలగాడు 10ఏళ్ళ నుంచి పీకిందేమి లేదు.. పవన్ కళ్యాణ్ పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..!!
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాజాగా టీడ్కో ఇళ్ళ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడ్కో ఇళ్లు గురించి చంద్రబాబు ఎప్పుడు ఆయనే ప్రారంభించారు అని చెప్పుకుంటారు. మరి అలాంటప్పుడు ఆయనే టీడ్కో ఇళ్ళ విషయంలో.. స్టార్ట్ చేసి పూర్తి చేస్తే… పేదలకు ఇవ్వడానికి నా దాకా సమయం ఎందుకొచ్చింది అంటూ జగన్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. టీడ్కో ఇళ్ళు మొత్తం 300 చదరపు అడుగులు అయితే.. కట్టడానికి ఆరు లక్షల రూపాయలు ఖర్చు అయితే…
సబ్సిడీ రూపంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల తరఫున మూడు లక్షలు వస్తే ఇంకా మిగిలిన మూడున్నర లక్షలు… ప్రతి పేదవాడి పేరిట అప్పు కింద రాసుకుని… 20 సంవత్సరాలు పాటు ప్రతినెల 3 వేల రూపాయలు కట్టుకుంటూ పోయే పరిస్థితి చంద్రబాబు సృష్టించాడు. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత అదే ఫ్లాట్ నీ రూపాయికే రిజిస్ట్రేషన్ అయ్యేలా చర్యలు తీసుకోవడం జరిగింది అని ప్రసంగించారు. చంద్రబాబుపరంగా చూస్తే టీడ్కో ఇళ్ళు పేదవాడికి ఇచ్చినట్టేనా అని జగన్ ప్రశ్నించడం జరిగింది. కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ఇంకా ఎన్నికలకు సమయం ఏడాది కూడా లేదు.
ఈ క్రమంలో ప్రజలంతా చంద్రబాబు మోసపూరితమైన హామీల విషయంలో అప్రమత్తంగా ఉండి ఆలోచన చేయాలి అని జగన్ హెచ్చరించారు. కులాల వారీగా మేనిఫెస్టో తీసుకొచ్చి రకరకాల హామీలు ఇచ్చి చంద్రబాబు మోసం చేసే అవకాశాలు ఉన్నాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటు జగన్ తనదైన శైలిలో ప్రసంగించడం జరిగింది.