CM Ys Jagan : ఆ ప‌ద‌వికి కసరత్తు పూర్తి… ప్ర‌క‌ట‌న ఎప్పుడంటే..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

CM Ys Jagan : ఆ ప‌ద‌వికి కసరత్తు పూర్తి… ప్ర‌క‌ట‌న ఎప్పుడంటే..?

 Authored By kondalrao | The Telugu News | Updated on :27 June 2021,3:50 pm

CM Ys Jagan : తిరుమల తిరుపతి దేవస్థాన (టీటీడీ) పాలక మండలి పదవీ కాలం ముగిసి వారం రోజులు కావొస్తోంది. కానీ కొత్త బోర్డును ఇంకా ఏర్పాటు చేయలేదు. నూతన పాలక మండలి నియామకం కోసం కొంత ఎక్సర్ సైజ్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటుచేశారు. ఆ కసరత్తు సైతం పూర్తికావొచ్చినట్లు తెలుస్తోంది. టీటీడీ చైర్మన్ సహా బోర్డు మెంబర్స్ గా కొత్త వారికి ఛాన్స్ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు జాతీయ స్థాయిలో ఒత్తిళ్లు వస్తున్నట్లు చెబుతున్నారు. వాటిని దృష్టిలో పెట్టుకొనే సీఎం జగన్ స్టడీ చేయించినట్లు తెలుస్తోంది.

Ysrcp

Ysrcp

తండ్రి బాటలో..

ప్రస్తుతం ఖాళీగా ఉన్న టీటీడీ చైర్మన్ పదవిని భర్తీ చేసే విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాటలో నడుస్తున్నారని సమాచారం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీటీడీ చైర్మన్ గా కనుమూరి బాపిరాజును నియమించిన సంగతి తెలిసిందే. కనుమూరి బాపిరాజు క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. కాబట్టి మళ్లీ అదే సామాజిక వర్గానికి టీటీడీ చైర్మన్ పోస్టును ఇవ్వాలని జగన్ అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏపీలో ఎక్కువ పదవులను రెడ్డి కులస్తులకే ఇస్తున్నారనే అపవాదును వైఎస్సార్సీపీ ప్రభుత్వం మోస్తోంది. అందుకే దాన్నుంచి బయటపడటానికి సీఎం వైఎస్ జగన్ చివరికి తన బాబాయి వైవీ సుబ్బారెడ్డిని కూడా పక్కన పెట్టినట్లు అర్థంచేసుకోవచ్చు.

ys jagan ap cm ys jagan sketch for second time victory

ys-jagan-ap-cm-ys-jagan-sketch-for-second-time-victory

అనుకున్నామని..: CM Ys Jagan

టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డినే కొనసాగిస్తారని లేదా గతంలో ఒకసారి పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డికి రెండోసారి ఛాన్స్ ఇస్తారని రకరకాలుగా ప్రచారం జరిగింది. కానీ అవేవీ నిజం కాలేదు. వైవీ సుబ్బారెడ్డిని ప్రస్తుతం పక్కన పెట్టినా ఆయనకు తగిన పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భావిస్తున్నారు. పార్లమెంటులోని పెద్దల సభకు వెళ్లాలనుకుంటే కొన్నాళ్లు వెయిట్ చేయాలని వైవీ సుబ్బారెడ్డికి ముందే చెప్పారని అంటున్నారు.

ఇతర ఆలయాలకీ..

తిరుమల తిరుపతి దేవస్థానంతోపాటు శ్రీశైలం దేవస్థాన పాలక మండలి, ఇతర నామినేటెడ్ పోస్టులను పార్టీ నాయకులకు అప్పగించేందుకు అధినాయకుడు వైఎస్ జగన్ వైఎస్సార్సీపీ సీనియర్ నేతలతో సమావేశాలను నిర్వహిస్తున్నారు. వాళ్ల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా కొంత మంది పేర్లను రికమెండ్ చేసిందని అంటున్నారు. అసలే ఇప్పుడు కమలం పార్టీకి, వైఎస్సార్సీపీకి మధ్య బంధం బలపడుతోంది. అందుకే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనదైన శైలిలో టీటీడీతోపాటు ఇతర ఆలయాల పాలకమండళ్లలో మార్పులు చేర్పులకు రంగం సిద్ధం చేస్తున్నారు.

kondalrao

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది