Amla Pulihora Recipes : రోగనిరోధక శక్తిని పెంచి జుట్టు, చర్మాన్ని ఆరోగ్యంగా చేసే కమ్మనైన ఉసిరికాయ పులిహోర…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Amla Pulihora Recipes : రోగనిరోధక శక్తిని పెంచి జుట్టు, చర్మాన్ని ఆరోగ్యంగా చేసే కమ్మనైన ఉసిరికాయ పులిహోర…!

Amla Pulihora Recipes : ఈరోజు ఉసిరికాయతో పులిహార ని ఎలా చేసుకోవచ్చు చూపిస్తున్నానండి. ప్రకృతి ఇచ్చే ప్రతిఫలంలో కూడా సీజనల్ గా మనలో వచ్చే మార్పులకి చిన్న చిన్న ఇబ్బందులకి హెల్త్ ప్రాబ్లమ్స్ కి కూడా మంచి సొల్యూషన్ బెనిఫిట్స్ అనేవి ఆ సీజన్ లో గాని మనకి అందుబాటులో దొరుకుతాయి. మరి ఈ సీజన్ లో దొరికే ఉసిరికాయలతో పులిహార నీ కమ్మగా ఎలా చేసుకోవాలో చూద్దామా… దీనికి కావాల్సిన పదార్థాలు:  ఉసిరికాయలు, జిలకర, […]

 Authored By jyothi | The Telugu News | Updated on :10 December 2023,10:00 am

ప్రధానాంశాలు:

  •  Amla Pulihora Recipes : రోగనిరోధక శక్తిని పెంచి జుట్టు, చర్మాన్ని ఆరోగ్యంగా చేసే కమ్మనైన ఉసిరికాయ పులిహోర...!

Amla Pulihora Recipes : ఈరోజు ఉసిరికాయతో పులిహార ని ఎలా చేసుకోవచ్చు చూపిస్తున్నానండి. ప్రకృతి ఇచ్చే ప్రతిఫలంలో కూడా సీజనల్ గా మనలో వచ్చే మార్పులకి చిన్న చిన్న ఇబ్బందులకి హెల్త్ ప్రాబ్లమ్స్ కి కూడా మంచి సొల్యూషన్ బెనిఫిట్స్ అనేవి ఆ సీజన్ లో గాని మనకి అందుబాటులో దొరుకుతాయి. మరి ఈ సీజన్ లో దొరికే ఉసిరికాయలతో పులిహార నీ కమ్మగా ఎలా చేసుకోవాలో చూద్దామా… దీనికి కావాల్సిన పదార్థాలు:  ఉసిరికాయలు, జిలకర, తాళింపు గింజలు, ఎండుమిర్చి, రైస్ ,ధనియాలు, నువ్వులు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, పచ్చిమిర్చి మొదలైనవి… తయారీ విధానం; దీనికోసం ముందుగా మనం రైస్ ని ఉడక పెట్టుకోవాలండి. బియ్యాన్ని కుక్కర్ లో వేసుకుని శుభ్రంగా కడిగేసి మన ఏ గ్లాస్ తో రైస్ తీసుకుంటున్నామో ఆ గ్లాస్ తో ఒకటి ముప్పావు గ్లాస్ దాకా నీళ్లు పోసుకోండి. కుక్కర్లో అయితే మీకు ఒకటి ముప్పావు గ్లాస్ తో పొడిపొడిగా రైస్ వస్తుంది. అదే మీరు స్ట్రా మీద ఉడికించుకునే పని అయితే కొంచెం నీళ్లు ఎక్కువ వేసుకొని డైరెక్ట్ గా స్టవ్ మీద పెట్టి చేసుకోవచ్చు.. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక టీ స్పూన్ దాకా నూనె కూడా వేసేసి ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసుకోండి. అన్నం ఉడికిన తర్వాత ఒకసారి గరిటతో కలిపేసి అన్నాన్ని పొడిపొడిగా చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఉసిరికాయ పులిహోర కోసం ఆరు దాకా మీడియం సైజ్ లో ఉండే ఉసిరికాయలు తీసుకోండి.

ఉసిరికాయలు శుభ్రంగా వాష్ చేసేసి ముక్కలుగా చేసుకోండి. ఈ ఉసిరికాయతో చలికాలంలో వచ్చే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కి మంచి సొల్యూషన్ అయితే దొరుకుతుంది. అండ్ అలాగే చలికాలంలో మనకి ఎక్కువగా కాన్స్టిట్యూషన్ అనేది గమనిస్తూ ఉంటాము. గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా ఉసిరికాయలతో కంట్రోల్ అయిపోతాయి.. అలాగే ఇమ్యూనిటీని పెంచి ఒక గొప్ప ఔషధం ఉసిరికాయ. ఒకటి రెండు కాదండి ఉసిరికాయలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. అందులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ దాక పసుపు వేసేసి కొంచెం కోర్స్ గా బ్లడ్ చేసుకోండి. తర్వాత ఒక కడాయిలో హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకోండి. ధనియాలు కొంచెం లో ఫ్లేమ్ లో వేయించి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా నువ్వులు కూడా వేసుకోండి. నువ్వులు కూడా చలికాలానికి చాలా మంచిది. నువ్వులు కొంచెం చిటపటలాడేంత వరకు వేయించుకున్న తర్వాత ఈ ధనియాలు కూడా వేసుకొని ఫైన్ పౌడర్ల గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తటి పిండిని తయారు చేసుకుని పక్కన పెట్టేసేయండి. అదే కడాయిలో నెక్స్ట్ రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో తాలింపు గింజలు వేసుకోవాలి.

అలాగే వేరుసెనుగులు ఇవన్నీ కలిపి రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా వేసి ఒక మూడు ఎండుమిర్చిని వేసుకోండి. తాలింపు వేగిన తర్వాత తురిమిన అల్లాన్ని ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే రెండు రెమ్మలు దాకా కరివేపాకు నాలుగు పచ్చిమిర్చిని చీల్చుకుని వేసేసి పచ్చిమిర్చి దోరగా వేయించుకోవాలి. తర్వాత కొంచం ఇంగువ వేసి ఒకసారి కలుపుకోండి. నెక్స్ట్ మన గ్రైండ్ చేసుకున్న ఉసిరికాయ తొక్కును కూడా వేసేసి ఒక ఆరు నిమిషం పాటు వేయించండి. అంత కలిపేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్న ధనియాలు నువ్వుల పొడిని కూడా వేసి ఒకసారి మిక్స్ చేయండి. ఇందులోకి మనం ఉడికించుకుని పొడిపొడిగా చేసి పెట్టుకున్న రైస్ మొత్తాన్ని కూడా వేసి బాగా కలిపేసేయండి. లో ఫ్లేమ్ లో పెట్టుకొని రైస్ ని అంతా కలిపిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అండ్ సింపుల్ గా అయిపోయి ఆమ్లా రైస్ ఉసిరికాయ పులిహార రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి.

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది