Aratikaya Podi Fry : అరటికాయతో సూపర్ డిష్… ఎలా చేయాలో తెలుసుకోండి…?
ప్రధానాంశాలు:
Aratikaya Podi Fry : అరటికాయతో సూపర్ డిష్... ఎలా చేయాలో తెలుసుకోండి...?
Aratikaya Podi Fry : మన రోజువారి జీవితంలో మనం ఎన్నో రకాల కూరగాయలను వాడుతూ ఉంటాము. అయితే ఈ కూరగాయలలో ఒకటి అరటి కాయ. అయితే ఈ అరటికాయను చాలా మంది తినరు. కానీ మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి పెడితే చాలు మళ్ళీ మళ్ళీ తినడానికి ఇష్టపడతారు. ఈ ఫ్రై అనేది ఎంతో టేస్టీగా ఉంటుంది. అలాగే ఇది ఆరోగ్యానికి కూడా మంచిది. అయితే మటన్ లో ఉండే పోషక విలువలతో అరటికాయ సమానం అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ అరటికాయలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అలాగే ఈ అరటికాయతో బజ్జీలు కూడా చేస్తారు. ఈ బజ్జీలను తినటానికి ఇష్టపడతారు. కానీ కూరను తినడానికి ఎవరు ఇష్టపడరు. మీరు గనక సరిగ్గా వండితే ఈ కూర ఎంతో టేస్టీగా ఉంటుంది. అయితే ఈ అరటికాయ పొడి ఫ్రై ను చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. మరి దీనికి కావలసిన పదార్థాలు ఏమిటి.? దీనిని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Aratikaya Podi Fry కావలస్సిన పదార్థాలు
అరటికాయలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్, కొబ్బరి తురుము, చింతపండు, మినప్పప్పు,బెల్లం,ధనియాలు, సోంపు, ఎండుమిర్చి, పల్లీలు, ఆవాలు, కరివేపాకు, నూనె…
తయారీ విధానం : దీనికోసం మనం ముందుగా మసాలా పొడిని తయారు చేసుకోవాలి. అలాగే స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని దానిలో ధనియాలు మరియు సోంపు, మినప్పప్పు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. అవి చల్లారిన వెంటనే వాటిని పొడి చేసి పెట్టుకోవాలి. దీనిలో కొద్దిగా చింతపండు మరియు కొబ్బరి తురుము, బెల్లం తురుము కూడా వేసుకోవాలి. దాని తర్వాత అరటి కాయను చిన్నపాటి ముక్కలుగా కట్ చేసి వాటికి ఉప్పు మరియు పసుపు కలిపి నీళ్లలో వెయ్యాలి. ఇప్పుడు మీరు పెనం పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ పోసి వేడి చేసుకోవాలి.
దానిలో కొద్దిగా తాలింపులు మరియు పల్లీలు వేసి చిటపటలాడక వాటిలో కొన్ని ఎండుమిర్చి మరియు కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. అలాగే దానిలో ఉల్లిపాయ మరియు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత వాటిలో అరటికాయ ముక్కలు కూడా వేయాలి. ఆ అరటికాయ ముక్కలను పది నిమిషాలు వేయించిన తర్వాత వాటిలో మసాలా పొడులు వేయాలి. ఇప్పుడు ఇంకొక 10 నిమిషాల పాటు అలా వేయించాలి. దానిలో చివరగా కొత్తిమీర వేసి స్టవ్ మీద నుంచి దింపాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ పొడి ఫ్రై రెడీ. ఈ ఫ్రై ను వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది