Karam Thonalu Recipe : ఎంతో టేస్టీగా ఉండే కమ్మని కారం తోనలు ఇది ఒక్కసారి తింటే ఒకటికి పది తినాలనిపిస్తుంది…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Karam Thonalu Recipe : ఎంతో టేస్టీగా ఉండే కమ్మని కారం తోనలు ఇది ఒక్కసారి తింటే ఒకటికి పది తినాలనిపిస్తుంది…!

 Authored By prabhas | The Telugu News | Updated on :21 October 2022,7:30 am

Karam Thonalu Recipe : కారం తొనలు సింపుల్ అండి సూపర్ ఈజీ రెసిపీ.. టీతో పాటు ఏదైనా స్నాక్స్ తినేవాళ్ళకి ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుంది. అలా కాకుండా మూవీ టైమ్స్ స్నాక్స్ గా కూడా చాలా బాగా నచ్చుతాయి. ఈ కారం తొనలు ఎంతో టేస్టీగా, క్రిస్పీగా ఉంటాయి. చిన్నపిల్లలు వీటిని బాగా ఇష్టపడతారు. ఎప్పుడు రొటీన్ గా తినే బజ్జి ,గారే ,పకోడీ ఇలాంటివి కాకుండా ఇలా వెరైటీగా ఈ కారం తొనలు చేసుకొని తినవచ్చు… ఈ కారం తొనలు ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం.. దీనికి కావలసిన పదార్థాలు : నెయ్యి ,మైదా, ఉప్పు, నీళ్లు ఆయిల్, కారం,మొదలైనవి…

దీని తయారీ విధానం : ముందుగా ఒక బౌల్ లోకి కప్పున్నర మైదాని తీసుకొని దాన్లో ఒక చిన్న కప్పు నెయ్యిని కరిగించి ఆ మైదాలో వేసి ,కొంచెం ఉప్పు కూడా వేసి బ్రెడ్ క్రంచి పౌడర్ లాగా వచ్చేలాగా కలుపుకోవాలి. తర్వాత దానిలో కొంచెం కొంచెం గా నీళ్లు పోస్తూ.. పిండిని చాలా స్మూత్ గా మెత్తగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న పిండిని పది నిమిషాల పాటు పక్కన ఉంచుకొని. తర్వాత ఆ పిండిని తీసుకొని చపాతీలా ఒత్తే దానిమీద పెద్దగా కొంచెం పల్చగా దీనిని రోల్ చేసుకోవాలి. ఆ విధంగా పెద్దగా రోల్ చేసుకున్న చపాతి ని ఒక చాక్ తీసుకొని ఒకటే కొలతలతో స్లైసెస్ ను కట్ చేసుకోవాలి. మొదట నిలువుగా కట్ చేసుకున్న తర్వాత ,తర్వాత అడ్డంగా కట్ చేసి స్క్వేర్ మాదిరిగా వచ్చిన స్లైసెస్ ని అటు ఇటు కాకుండా మధ్యలో నాలుగు ఐదు ఘాట్లను చాకుతో పెట్టుకోవాలి.

Karam Thonalu Recipe in Telugu

Karam Thonalu Recipe in Telugu

అన్నిటికీ అలా పెట్టుకున్న తర్వాత వాటిని అటు చివర ఇటు చివర పట్టుకుని రోల్ చేసుకుంటూ తొనల చుట్టుకోవాలి. ఇలా చేయడానికి ఈ పొడి పిండి అనేది ఎక్కువగానే పడుతూ ఉంటుంది. ఇలా అన్నిటిని చేసుకొని ఒక ప్లేట్లో ఉంచుకొని. తర్వాత స్టౌ పై ఒక లోతుగా ఉన్న కడాయిని పెట్టుకుని దానిలో డీప్ ఫ్రై కి సరిపడినంత ఆయిల్ ని వేసుకొని ఆ ఆయిల్ హీటెక్కిన తర్వాత దాన్లో ఒక ఐదు ఆరు ఈ తొనలను వేసి ఫస్ట్ కదపకుండా పది నిమిషాల పాటు వదిలేయాలి. అలా వదిలేయడం వలన లోపలి వరకు బాగా ఉడుకుతాయి. అలా ఉడికిన వాటిని గరిటతోని మళ్లీ నెమ్మదిగా అటు ఇటు కదుపుతూ ఎర్రగా క్రిస్పీగా వేయించుకోవాలి. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే కడాయిలో ఈ తొనలను కొన్ని కొన్ని మాత్రమే వేసి వేయించుకోవాలి.

మూకుడు నిండా వేస్తే అవి వేగవు మెత్తగా అలాగే ఉండిపోతూ ఉంటాయి. కావున కేవలం 5, 6 మాత్రమే వేసి నెమ్మదిగా ఎర్రగా, క్రిస్పీగా వేయించుకొని తీసి ఒక బుట్టలో వేసుకోవాలి. అలా అన్ని వేయించుకొని బుట్టలో వేసుకున్న తర్వాత వేడిగా ఉన్నప్పుడే కొంచెం కారం నల్ల ఉప్పుని కలిపి వాటి పైన చల్లి బాగా కలుపుకోవాలి. ఒక వేళ నల్ల ఉప్పు లేకపోతే కరివేపాకు పొడిని కూడా చల్లుకోవచ్చు..అలా బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే కారం చల్లుకుంటే తొనలకి బాగా పడుతుంది. ఒకవేళ చల్లారిన తర్వాత వేస్తే అవి వాటికి పట్టదు.. ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత ఒక గాలి చోరని డబ్బాలో పెట్టుకుంటే 15 రోజులపాటు నిల్వ ఉంటాయి. ఇవి మూవీ చూస్తూ స్నాక్స్ లా తినవచ్చు. ఈవినింగ్ టీ టైంలో తినవచ్చు. ఇది ఒక్కసారి తిన్నారంటే పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. అంతా బాగుంటాయి ఈ తొనలు కారం కారంగా క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉంటాయి.

YouTube video

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది