Mutton Chudwa Recipe : మటన్ పచ్చడి కి దీటుగా ఉండే మటన్ చుడ్వా..!
Mutton Chudwa Recipe : ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ చుడ్వా. నెలరోజులపాటు నిల్వ ఉండే మటన్ చుడ్వా. చారు అన్నంతో, చపాతీ, రోటీతో దీంతోనైనా నంజుకున్నా కానీ చాలా బాగుంటుంది. లేత మటన్ తో ఈ చుడ్వా చేస్తే ఒక రేంజ్ లో ఉంటుంది. ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం.. దీనికి కావలసిన పదార్థాలు : మటన్, కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఆయిల్, జీడిపప్పు, చాట్ మసాలా, కరివేపాకు, ఎండు మిరపకాయలు మొదలైనవి… తయారీ విధానం : ముందుగా కేజీ మటన్ తీసుకొని కుక్కర్లో వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు,
ఉప్పు, కారం ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, ఆయిల్, వాటర్ పోసి బాగా ఉడికించుకోవాలి. నీళ్లు అంత ఇంకిపోయే వరకు మటన్ మంచిగా కుక్ అయ్యేవరకు ఉడికించుకోవాలి. బాగా ఉడికిన మటన్ ని తీసి ఒక బౌల్లో వేసి అంతా దానిని సన్నని ధారాల చీల్చుకోవాలి. తర్వాత స్టౌ పై ఒక కడాయిని పెట్టి దానిలో నూనె వేసి దాన్లో జీడిపప్పుని వేసి ఎర్రగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఎండుమిర్చి కరివేపాకుని కూడా బాగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగిన తర్వాత ముందుగా మటన్ ఉడికించుకొని దారాల చేసుకున్న
మటన్ వేసి బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఈ మటన్ బాగా ఎర్రగా డ్రైగా అయ్యేవరకు వేయించుకోవాలి. ఇది ఎర్రగా ఏగడానికి కనీసం 20 నిమిషాల పాటు టైం పడుతుంది. చేత్తో నలిపి చూస్తే మంచిగా క్రస్పిగా ఉండాలి. ఇక స్టవ్ ఆపే దానిని ఒక బౌల్ లోకి తీసుకొని దాన్లో ముందుగా వేయించుకున్న జీడిపప్పు అలాగే కరివేపాకు, మిరపకాయలు, చాట్ మసాలా కొంచెం కారం వేసి బాగా కలుపుకొని దానిని ఒక గాజు సీసాలోకి స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. మటన్ ప్రియులు ఈ విధంగా ట్రై చేసి చూస్తే.. ఇక ఎప్పుడూ ఇలాగే చేసుకుంటారు.