Onion Kachori Recipe : క్రిస్పీగా క్రిస్పీగా ఉల్లి కచోరి… ఇలా చేసి చూడండి…!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 19 October 2022, 7:00 am

Onion Kachori Recipe : సాయంత్రం అవ్వగానే ప్రతి ఒక్కరికి స్నాక్స్ తినాలనిపిస్తుంది. మరి ముఖ్యంగా పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ కోసం ఎదురు చూస్తుంటారు. అయితే స్నాక్స్ టైంలో ఉల్లి కచోరి చేసుకుని తింటే ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది. పిల్లలు ఎంతో ఇష్టపడే ఈ ఉల్లి కచోరీ ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: 1) మైదాపిండి 2) ఉల్లిపాయ 3) పచ్చిమిర్చి 4) ఉప్పు 5) కారం 6) అటుకులు 7) కొత్తిమీర 8) ధనియాల పొడి 9) గరం మసాలా 10) జీలకర్ర పొడి 11) వాము 12) నెయ్యి 13) అల్లం వెల్లుల్లి పేస్ట్ 14) నిమ్మరసం

తయారీ విధానం: ముందుగా ఒక గిన్నెలోకి రెండు కప్పుల మైదాపిండి, అర టీ స్పూన్ వాము, రుచికి సరిపడా ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బాగా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ సాఫ్ట్ గా చేసుకోవాలి. తరువాత ఈ పిండిని 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్లో ఒక కప్పు తరిగిన ఉల్లిపాయలు, పావు కప్పు అటుకులు, సన్నగా తరిగిన రెండు పచ్చిమిర్చి ముక్కలు, రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, రెండు టీ స్పూన్ల సన్నగా తరిగిన కొత్తిమీర, అర టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, అర టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా, అర చెక్క నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి.

Onion Kachori Recipe in Telugu

Onion Kachori Recipe in Telugu

ఇలా తయారు చేసుకున్న ఉల్లిపాయ స్టప్పింగ్ ను పక్కన పెట్టుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్నా పిండిని మళ్లీ ఒకసారి కలిపి ఉండలుగా చేసుకోవాలి. పిండి లేకుండా అప్పలాగ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 2,3 స్పూన్ నెయ్యి, రెండు టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి. దీనిని ఒక చపాతి పై పూసి దానిపై మరొక చపాతీని పెట్టి దానిపై కూడా పూసి ఇలా నాలుగు చపాతీలకి పూయాలి. ఇప్పుడు ఈ చపాతీలను రోల్ చేసి కట్ చేసుకోవాలి. కట్ చేసిన వాటిని చేతితో అదిమి చపాతీ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీలోకి స్టఫింగ్ ని పెట్టి క్లోజ్ చేయాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి కచోరీలను ఫ్రై చేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీ అయిన ఉల్లి కచోరి రెడీ అయిపోయినట్లే.

Advertisement

Also read

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి