Rava Burfi Recipe : తక్కువ సమయంలో ప్రిపేర్ చేసుకోగలిగే రవ్వ బర్ఫీ ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది…!
Rava Burfi Recipe : ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వ బర్ఫీ తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోగలిగే రవ్వ బర్ఫీ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను.. వచ్చేవన్నీ పండగలే కాబట్టి ఇలాంటి స్వీట్ తయారు చేసుకోవడానికి ఇలాంటి సందర్భాల్లో చాలా బాగుంటుంది. వంట రాని వాళ్లు కూడా ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు.. ఈ బర్ఫీని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ సింపుల్ అయిన రవ్వ బర్ఫీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం… దీనికి కావాల్సిన పదార్థాలు : బొంబాయిరవ్వ, పాలు, యాలకుల పొడి, నెయ్యి, జీడిపప్పు, కుంకుమపువ్వు, పంచదార మొదలైనవి… దీని తయారీ విధానం : ముందుగా ఒక రెండు కప్పుల బొంబాయి రవ్వకి ఒక అర కప్పు నెయ్యి పడుతుంది.
స్టాప్ పై ఒక కడాయి పెట్టుకొని దానిలో అరకప్పు నెయ్యి వేసి అది కరిగిన తర్వాత బొంబాయి రవ్వని వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇంకొక స్టవ్ పై పాలు మరగబెట్టుకోవాలి. దాంట్లో కొంచెం కుంకుమ పువ్వు కూడా వేసి బాగా మరగబెట్టాలి. ఇక రవ్వ మంచిగా వేగిన తర్వాత కాగిన పాలని కొంచెం కొంచెంగా పోస్తూ రవ్వని బాగా కలుపుకోవాలి. అలా పాలు మొత్తం కూడా కొంచెం కొంచెంగా పోస్తూ రవ్వని దగ్గరగా అయ్యేవరకు కలుపుకోవాలి. పాలు అన్ని అయిపోయిన తర్వాత రవ్వని బాగా దగ్గరకయ్యే వరకు కలుపుకొని తర్వాత ఒక కప్పు పంచదార కూడా వేసి మళ్లీ బాగా కలుపుకోవాలి. పంచదార కరిగి రవ్వ అంత దగ్గరగా అయ్యేవరకు కలుపుకొని దానిలో సన్నగా కట్ చేసిన జీడిపప్పు పలుకులను అలాగే కొంచెం యాలకుల
పొడిని కూడా వేసి బాగా కలిపి బర్ఫీ అయ్యేలా వచ్చేవరకు ఉడికించిన తర్వాత ఒక స్క్వేర్ బాక్స్ ని తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకొని ఈ మిశ్రమాన్నంత ఆ బాక్స్ లో వేసి స్పూన్ తీసుకొని మంచిగా సర్దుకోవాలి. అలా సర్దుకున్న బాక్స్ ని ఒక గంట పాటు వదిలేయాలి. ఈ విధంగా వదిలేసిన బాక్స్ ని గంట తర్వాత ఒక ప్లేట్ లోకి బోర్లించి బర్ఫీని ప్లేట్లోకి వేసుకున్న తర్వాత చాక్ తో మీకు కావలసిన షేప్లో కట్ చేసుకోవచ్చు. అంతే ఎంతో ఈజీగా సింపుల్ గా రవ్వ బర్ఫీ రెడీ. వంట రాని వాళ్లు కూడా ఎంతో సులభంగా చేసేయొచ్చు.. ఇప్పుడు వచ్చే పండుగలకు ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి… చాలా బాగుంటాయి..
