Soya 65 Recipe : కరకరలాడే సోయా 65… పది నిమిషాల్లో ఇలా చేయండి…!
Soya 65 Recipe : పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒక స్నేక్స్ చేయమని గోల చేస్తుంటారు. అలాంటివారికి సోయాస్ 65 చేసి పెడితే ఎంతో రుచిగా ఉంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. సోయా మన ఆరోగ్యానికి ఎంత మంచిగా అందరికీ తెలిసిందే అలాంటి సోయాతో ఈ రెసిపీని కనుక చేసుకొని తిన్నారంటే ఆరోగ్యపరంగా కొన్ని ప్రయోజనాలను పొందుతారు ఇంకెందుకు ఆలస్యం సోయా 65 ను ఎలా తయారు చేసుకోవాలో దానికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: 1) సోయా 2) కార్న్ ఫ్లోర్ 3) ఉప్పు 4) ధనియాల పొడి 5) గరం మసాలా 6) కారం 7) పసుపు 8) కరివేపాకు 9) పచ్చిమిర్చి 10) అల్లం వెల్లుల్లి పేస్ట్ 11) ఆయిల్
తయారీ విధానం: ముందుగా పాన్లోకి మూడు కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఆ నీళ్లు బాగా వేడయ్యాక ఒకటిన్నర కప్పు సోయా చంక్స్ ను వేసుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్ వేసి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆ సోయా చంక్స్ లోని నీళ్లు పిండేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒకటిన్నర టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ గరం మసాలా రెండు మూడు టీ స్పూన్ల కార్న్ ఫ్లోర్, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ సోయా చంక్స్ ను ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు ఒక పాన్ లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి సోయా చంక్స్ ను వేసి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు, నాలుగైదు పచ్చిమిర్చి లు వేసి మరో నిమిషం బాగా ఫ్రై చేసి తీసుకోవాలి. అలాగే ఇందులోకి వెల్లుల్లి కూడా ఫ్రై చేసుకుని వేసుకోవాలి. ఇంకా ఎంతో టేస్టీ అయిన సోయా 65 రెడీ అయినట్లే. దీన్ని పప్పులోకి నంచుకుని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ సోయా 65 రెడీ చేసుకోవడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. సులువుగా 10 నిమిషాల్లో చేసేయవచ్చు. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. కచ్చితంగా ఇంట్లో వాళ్ళు అందరూ ఇష్టపడి తింటారు.