Kodiguddu Kaaram Recipe : నోరూరించే కోడిగుడ్ల కారం ఇలా చేసుకోండి…!!
Kodiguddu Kaaram Recipe : వాన కాలంలో ఎక్కువగా జలుబు, దగ్గులు వస్తూ ఉంటాయి. వీటి నుంచి ఉపశమనం పొందాలంటే నోటికి కొద్దిగా కారం తగలాల్సిందే. అయితే శరీరంలో రోగనిరోధక శక్తి పెరగటానికి దగ్గు జలుబు వంటి సమస్యలు తగ్గటానికి కోడిగుడ్లు సహాయపడతాయి. కోడిగుడ్లతో కారం చేసుకునే తింటే ఎంతో రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: 1) కోడిగుడ్లు 2) ఉల్లిపాయలు 3) పచ్చిమిర్చి 4) కొత్తిమీర 5) కారం 6) ఉప్పు 7) పసుపు 8) జీలకర్ర 9) ఆవాలు 10) పచ్చిశనగపప్పు 11) మినప్పప్పు 12) ఆయిల్ 13) కరివేపాకు 14) ఎండు కొబ్బరి 15) పుట్నాల పప్పు
తయారీ విధానం: ముందు ఉడికించిన 6 కోడిగుడ్లను తీసుకోవాలి. ఇప్పుడు ఈ గుడ్లకి లైట్ గా గాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ లో మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక టీ స్పూన్ మినప గుండ్లు వేసి వేగాక మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి ముక్కలు, మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, పావు టీ స్పూన్ పసుపు వేసి వేయించుకోవాలి.
ఇప్పుడు ఇందులో ఉడకబెట్టుకున్న కోడిగుడ్లను వేసి మంటను లో ఫ్లేమ్ లో ఉంచి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి. మంటను లో ఫ్లేమ్ లో ఉంచి మిక్సీలో మూడు టీ స్పూన్ల కారం, పది వెల్లుల్లి రెబ్బలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, వన్ టేబుల్ స్పూన్ ఎండుకొబ్బరి, వన్ టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో రెండు ఉల్లిపాయ ముక్కలు వేసి గరుకుగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ ను కోడిగుడ్లలో వేసి బాగా కలిపి ఆయిల్ తేలేంతవరకు మంటను లో ఫ్లేమ్ లో ఉంచి బాగా కలుపుకోవాలి. చివర్లో తరిగిన కొత్తిమీర వేసి కలుపుకుంటే ఎంతో రుచికరమైన కోడిగుడ్డుకారం రెడీ.