Tandoori Chicken Recipe : కుక్కర్ లో ఇలా తందూరి చికెన్ చేసుకోండి.. పక్క రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tandoori Chicken Recipe : కుక్కర్ లో ఇలా తందూరి చికెన్ చేసుకోండి.. పక్క రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది…!!

 Authored By prabhas | The Telugu News | Updated on :8 January 2023,7:40 am

Tandoori Chicken Recipe : ఈరోజు రెసిపీ వచ్చేసి తందూరి చికెన్.. ఈ తందూరి చికెన్ ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ లో వచ్చేలా నేను మీకు చూపించబోతున్నాను.. ఫర్ఫెక్ట్ గా వస్తుందండి 100% గ్యారెంటీ ఇస్తాను. అలాగే దీంతో పాటు గ్రీన్ చట్నీ కూడా చేసి చూపిస్తాను.. ఈ గ్రీన్ చట్నీ తందూరి చికెన్ కాంబినేషన్ అదిరిపోదండి.. ఇక ఈ తందూరి చికెన్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం.. దీనికి కావలసిన పదార్థాలు : చికెన్ లెగ్ పీస్ లు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, చాట్ మసాలా, ధనియాల పొడి, పెరుగు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, ఉల్లిపాయలు, ఆయిల్, నెయ్యి మొదలైనవి… దీని తయారీ విధానం : ముందుగా తందూరి చికెన్ కోసం లెగ్ పీసెస్ తీసుకోవాలి. కాస్త పెద్ద పిస్లు తీసుకొని వాటికి ఘాట్లు పెట్టుకోవాలి. ఆ విధంగా గాట్లు పెట్టుకున్న తర్వాత వాటిని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.

తర్వాత మ్యారినేషన్ కోసం ఒక నిమ్మ చెక్క తీసుకొని రసం పిండుకోవాలి. తర్వాత అల్లం ఎల్లిపాయ పచ్చిమిర్చి కలిపి చేసిన పేస్ట్ ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక రెండు స్పూన్లు ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఒక టీ స్పూన్ కారం, తర్వాత దీనిని బాగా మసాలాలను అన్ని పట్టేలా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ పీసుల్ని ఒక రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి. రెండు గంటలు అయిన తర్వాత సెకండ్ మ్యారేజ్ కోసం స్టవ్ పై కడాయి పెట్టుకుని దానిలో మస్టర్డ్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీటెక్కిన తర్వాత స్టవ్ ఆపుకొని కారం వేసి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ అంత ఒక ప్లేట్లో పోసుకోవాలి. తర్వాత దానిలో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత గల్లుప్పు, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ ఒక స్పూన్ తర్వాత ఒక స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. తర్వాత ఒక టీ స్పూన్ కసూరి మేతి కూడా వేసుకోవాలి.

Tandoori Chicken Recipe in Telugu on Video

Tandoori Chicken Recipe in Telugu on Video

అలాగే ఒక టీ స్పూన్ గరం మసాలా కూడా వేయాలి. తర్వాత ఒక రెండు స్పూన్లు గట్టి పెరుగు కూడా వేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమం అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత ఏం మిశ్రమం ని మధ్యలో మిశ్రమమంతా జరుపుకొని ఒక గిన్నెను పెట్టుకోవాలి. ఆ గిన్నెలో బొగ్గుని వేడి చేసుకుని ఆ బొగ్గు దానిలో వేసి దానిపైన నెయ్యి వేస్తే పొగ వస్తుంది. ఆ ఆ పొగ వచ్చేటప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఈ పొగాంత మసాలా మిశ్రమానికి పడితే చికెన్ చాలా టేస్టీగా వస్తుంది. తర్వాత ఆ మసాలా అంతా తీసుకొని లెగ్ పీస్ లకి పట్టించాలి. ఈ విధంగా మసాలా పట్టించిన తర్వాత మరో అర్థగంట పాటు నానబెట్టుకోవాలి. ఇది నానేలోపు దీనికి కాంబినేషన్ గ్రీన్ చట్నీ చేసుకోవాలి. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని గుప్పెడు కొత్తిమీర మరో గుప్పెడు పుదీనా తర్వాత 4 వెల్లుల్లి కొంచెం

అల్లం కొన్ని ఉల్లిగడ్డ ముక్కలు తర్వాత మూడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని తర్వాత కొంచెం నిమ్మరసం పిండుకోవాలి. తర్వాత కొంచెం బెల్లం కూడా వేయాలి. తర్వాత కొంచెం నల్లుప్పు రుచికి సరిపడంత మామూలు ఉప్పు వేసి గ్రీన్ చట్నీ మిశ్రమం పట్టుకొని ఒక బౌల్లో పోసుకోవాలి. అంతే గ్రీన్ చట్నీ రెడీ అయిపోయినట్లే.. ఇక చికెన్ ప్రిపేర్ చేయడానికి ముందుగా కుక్కర్ని ఫ్రీ హీట్ చేసుకోవాలి. కుక్కర్ ఫ్రీ హీట్ అయిన తర్వాత కుక్కర్లో ఒక స్టాండ్ పెట్టుకొని ఈ తందూరి లెగ్ పీసుల్ని దాన్లో పెట్టి దానిపైన మూత పెట్టుకోవాలి. మూత పెట్టి 30 నిమిషాలు పాటు ఉడికించుకోవాలి. తర్వాత స్టౌ పై డ్రిల్ ఫ్యాన్ పెట్టి దానిపైన నెయ్యి అప్లై చేసి ఈ లెగ్ పీస్ ని రెండువైపులా పెట్టి మంచిగా కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి. రెండువైపులా నెయ్యి వేస్తూ ఎర్రగా కాల్చుకోవాలి. అంతే రెస్టారెంట్ స్టైల్ లో తందూరి చికెన్ రెడీ..

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది