Vada Recipe : పిండి రుబ్బే పని లేకుండా పది నిమిషాలలో రుచిగా ఇలా వడలు చేయండి వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Vada Recipe : పిండి రుబ్బే పని లేకుండా పది నిమిషాలలో రుచిగా ఇలా వడలు చేయండి వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి…!

Vada Recipe : ఈరోజు మనం ఆలు వడలు చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ వడలను మనం ఈజీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇక లేట్ చేయకుండా ఈ వడలు తయారీ విధానం చూద్దాం… దీనికి కావాల్సిన పదార్థాలు : బంగాళదుంపలు, బియ్యప్పిండి, ఆయిల్, ఉప్పు, మిక్స్డ్ వెబ్, చిల్లీ ఫ్లెక్స్, మొదలైనవి… దీని తయారీ విధానం : బౌల్ తీసుకొని అందులో ఉడికించిన బంగాళదుంపలు వేసుకోవాలి. […]

 Authored By prabhas | The Telugu News | Updated on :16 November 2022,7:30 am

Vada Recipe : ఈరోజు మనం ఆలు వడలు చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ వడలను మనం ఈజీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇక లేట్ చేయకుండా ఈ వడలు తయారీ విధానం చూద్దాం… దీనికి కావాల్సిన పదార్థాలు : బంగాళదుంపలు, బియ్యప్పిండి, ఆయిల్, ఉప్పు, మిక్స్డ్ వెబ్, చిల్లీ ఫ్లెక్స్, మొదలైనవి… దీని తయారీ విధానం : బౌల్ తీసుకొని అందులో ఉడికించిన బంగాళదుంపలు వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్మాషర్ తీసుకొని సాఫ్ట్ గా అయ్యేలా బంగాళదుంపలను స్మాష్ చేసుకోవాలి. మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా ఆలును బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి.

తర్వాత దీనిలో ఒక అరకప్పు బియ్యం పిండిని వేసి ఇలా కలుపుకున్న తర్వాత అందులో ఒక టీ స్పూన్ మిక్స్డ్ వెబ్స్, ఒక టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసి కలుపుకోవాలి. మనకి సరిపోతుంది. మళ్ళీ నీళ్లు పోయాల్సిన అవసరం లేదు మీకు మరీ గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసుకుని పిండిని సాఫ్ట్ గా కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత చేతికి ఆయిల్ రాసుకొని కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా రౌండ్ గా చేసుకోవాలి. పిండిలో ఎక్కడ బంగాళదుంప ఉండలు లేకుండా కలుపుకోవాలి. లేదంటే ఆయిల్ లో ఫ్రై చేసేటప్పుడు పేలుతాయి. ఇలా చేసుకున్నాక కొద్దిగా ప్రెస్ చేసి హోల్ పెట్టుకోవాలి.

Vada Recipe in Telugu

Vada Recipe in Telugu

ఈ విధంగా వడ షేపులో చేసుకోవాలి. ఇలా చేసుకున్న వడలన్నింటినీ ప్లేట్లోకి తీసుకోవాలి. అన్ని వడలను చేసుకున్న తర్వాత వేడి నూనెలో ఆలు వడలను ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వడలను మీడియం ఫ్లేమ్ లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా వడలను కూడా సేమ్ ప్రాసెస్ లో ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ వడలు మనకు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా బాగుంటాయి… పిండి రుబ్బే పని లేకుండా ఎంతో ఈజీగా వడల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు…

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది