Healthy Heart : గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే 4 వంట నూనెలు…!
ప్రధానాంశాలు:
Healthy Heart : గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే 4 వంట నూనెలు...!
Healthy Heart : ప్రస్తుతం ఉన్న ఆధునిక కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలామంది గుండె సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీనికి గల ముఖ్య కారణం ప్రస్తుతం జీవిస్తున్న జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లు అని చెప్పాలి . అందుకే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ముందు నుండే తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. దీనికోసం మన రోజువారి జీవితంలో కొన్ని మార్పులను చేసుకోవాల్సి ఉంటుంది. అయితే గుండె సమస్యలు బారిన పడితే మరణం వరకు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ముందు నుండి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలోనే గుండె జబ్బులను నివారించడానికి ఎలాంటి వంట నూనెలను ఉపయోగించాలి అనే సందేహాలు ప్రతి ఒక్కరికి వస్తుంటాయి. దీనికోసం కొన్ని రకాల వంటనూనెలను ఉపయోగించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని నిపుణులు సైతం చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
Healthy Heart ఆలివ్ ఆయిల్….
NIH నివేదించిన సమాచారం ప్రకారం దీనిలో ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మంచి కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. అంతేకాక ఇది కొలెస్ట్రాలను నియంత్రించడానికి ఎంతగానో సహాయపడుతుంది. అలాగే గుండె జబ్బుల నుంచి రక్షిస్తుంది. అంతేకాక ఈ నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇక ఇవి ఒత్తిడి క్యాన్సర్ డయాబెటిస్ ఫార్నెస్ అలర్జీ వంటి వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తాయి.
Healthy Heart సోయాబీన్ నూనె…
సోయాబీన్ నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మన శరీరంలో గాయాలను తగ్గించేందుకు ఎంతగానో సహాయపడతాయి . అంతేకాక దీనిలో ఉండే ప్లేవనాయిడ్స్ ,పాలీసాచ్యురేటెడ్ ప్యాటి యాసిడ్స్ ,గుండె సంబంధిత సమస్యల నుంచి మనల్ని రక్షిస్తాయి.
పొద్దు తిరుగుడు నూనె : పొద్దు తిరుగుడు నూనెలో విటమిన్ ఇ సమృద్ధిగా లభిస్తుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి ఎంతగానో సహాయపడుతుంది.
కనోలా నూనె : ఈ వంట నూనెను చాలా అరుదుగా వినియోగిస్తూ ఉంటారు. అయితే ఈ నూనె కొలెస్ట్రాల్ మరియు గుండె జబ్బులతో బాధపడుతున్న వ్యక్తులకు మొదటి ఎంపిక అని చెప్పవచ్చు.