Blood Tests : ప్రతి ఏటా కొన్ని రక్త పరీక్షలు చేయించుకుంటే చాలు… వందేళ్ళ జీవితం గ్యారంటీ… ఏవేవంటే…!
Blood Tests : మన శరీరంలో ఎటువంటి లక్షణాలు లేకపోయినా కొన్నిసార్లు ప్రాణాంతక వ్యాధులు అనేవి లోలోపల వృద్ధి చెందుతూ ఉంటాయి. కావున అన్ని సార్లు ఇలా జరగకపోయినా వ్యాధిని సకాలంలో గుర్తించటం మాత్రం చాలా ముఖ్యం. అందుకే మీ శరీరంలో ఎలాంటి వ్యాధి లేనప్పటికీ కూడా ప్రతి ఏటా కొన్ని ముఖ్యమైన రక్త పరీక్షలు చేయించుకోవాలి. USG నుండి యురినాలిసిస్ వరకు అవయవాల ఎక్స్ రేల వరకు వ్యాధిని నిర్ధారించడంలో కూడా ఎంతో సహాయపడే ఇతర రకాల రక్త పరీక్షలు కూడా ఉన్నాయి. కావున ముఖ్యంగా చెప్పాలంటే. షుగర్, కొలెస్ట్రాల్, యూరిక్ యాసిడ్ లాంటి వాటి స్థాయిలను నిర్ధారించేందుకు కూడా రక్త పరీక్షలు చేయించటం చాలా ముఖ్యం. మన ఆరోగ్యకరమైన జీవనశైలికి ఈ రక్త పరీక్షలు చేయించుకోవటం వలన సకాలంలో వ్యాధి ప్రమాదాలను కూడా తగ్గించుకోవచ్చు. ప్రతి సంవత్సరం కూడా ఈ రక్త పరీక్షలు అనేవి చేయించుకోవాలి. చేయించుకోవలసిన రక్త పరీక్షలు ఏమిటో ఇప్పుడు మనకు తెలుసుకుందాం.
Blood Tests : CBC టెస్ట్
రక్తంలో ఎర్ర రక్త కణాలు మరియు తెల్ల రక్త కణాలు లేక ప్లేట్ లైట్స్ పరిమాణాలను కొలిచేందుకు CBC పరీక్షలు అనేవి చాలా అవసరం. ఈ పరీక్ష వలన రక్తంలో ఏదైనా ఇన్ఫెక్షన్ లాంటివి సులభంగా తెలుసుకోవచ్చు. రక్తం గడ్డ కట్టే సామర్థ్యం కూడా ఈ రక్త పరీక్షల ద్వారా తెలుస్తుంది…
Blood Tests : లిపీడ్ ప్రొఫైల్
ప్రస్తుతం ఈ రోజులలో కొలెస్ట్రాల్ సమస్య అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. రక్తంలోని కొలెస్ట్రాల్ ఎంత పెరిగిందో తెలుసుకోవాలి అంటే. లిప్ట్ ప్రొఫైల్ టెస్ట్ అనేది కచ్చితంగా చేయించుకోవలసి ఉంటుంది. మీరు ప్రతి ఏటా పరీక్షలు కనుక చేయించుకుంటూ ఉంటే కొలెస్ట్రాల్ సమస్య నుండి కూడా మీరు ఆరోగ్యాన్ని సకాలంలో రక్షించవచ్చు…
Blood Tests : గ్లూకోజ్
రక్తంలోనే చక్కెర స్థాయిలు పెరగటం అనేది గుర్తించకపోతే మధుమేహం శరీరంపై కూడా ఎంతో నిశ్శబ్దంగా దాడి చేస్తుంది. ప్రతి ఏటా గ్లూకోజ్ ని కూడా చెక్ చేయించడం చాలా అవసరం. ఇలా గ్లూకోజ్ ను చెక్ చేయించడం వలన చక్కెర స్థాయిలు హెచ్చుతగ్గులు అనేవి కూడా సులభంగా తెలుసుకోవచ్చు. కావున నిర్ణయత వ్యవధిలో ఉపవాసం గ్లూకోజ్,HbA1c అనే రక్త పరీక్షలు కంపల్సరిగా చేయించుకోవాలి.
Blood Tests : థైరాయిడ్
థైరాయిడ్ హార్మోన్లు జీవక్రియ రేటును నిర్వహించడం దగ్గర నుండి రోగనిరోధక వ్యవస్థలు మెరుగుపరచడం వరకు కూడా అన్నింటికి ఎంతో అవసరం.ఈ హార్మన్ పరిమాణం అనేది పెరిగిన లేక తగ్గినా కూడా శరీరంలో రకరకాల సమస్యలు అనేవి వస్తాయి. అందుకే బరువు పెరగటం నుండి మానసిక కల్లోలం వరకు కూడా ఎన్నో సమస్యలు ఈ హార్మోన్ల వలన వస్తాయి. కావున ప్రతి ఏటా థైరాయిడ్, హార్మోన్ స్థానాలను తనిఖీ చేయించుకోవటం కూడా రక్త పరీక్షలు అనేవి చేయించుకోవటం మంచిది…
Blood Tests : CMP టెస్ట్
శరీరంలోని సోడియం మరియు పొటాషియం లేక క్లోరైడ్,బై కార్బోనేట్, క్రియాటినిన్, నైట్రోజన్, బిలిరుబిన్, ఆల్బుమిన్, ప్రోటీన్ లాంటి మూలకాలు సరైన మోతాదులో ఉన్నాయో లేవో కూడా తెలుసుకోవటానికి CMP అనే రక్త పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం…