Heart Attack : గుండెకు ఉప్పే కాదు.. ఇది కూడా ప్రమాదమే నట… బయటపడ్డ సంచలన నిజాలు…!
ప్రధానాంశాలు:
Heart Attack : గుండెకు ఉప్పే కాదు.. ఇది కూడా ప్రమాదమే నట... బయటపడ్డ సంచలన నిజాలు...!
Heart Attack : సహజంగా అందరికీ ఆరోగ్య సమస్యలు రావడానికి కారణాలు మనం తీసుకునే ఆహార పదార్థాలే అని అందరికీ తెలిసిందే.. అయితే ఆహార పదార్థాలలో ముఖ్యంగా ఉప్పు అధికంగా తీసుకుంటే ఆరోగ్యానికి ప్రమాదమేనని ఆరోగ్య నిపుణులు చెప్తూ ఉంటారు. ఉప్పును ఎక్కువగా తీసుకునే వారికి గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. అయితే వీలైనంతవరకు ఉప్పుని తగ్గించాలని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. ఉప్పు మాత్రమే కాదు. చక్కెర కూడా గుండెకు ప్రమాదమేనని ఇప్పుడు ఓ పరిశోధనలో తేలింది.. చక్కెర అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే శరీరంలో ఇన్ప్లేమేషన్ పెరుగుతుందని ఓ పరిశోధనలో తేలింది.
అధిక ఇంప్లిమేషన్ వలన గుండె మూత్రపిండాల్లోని, రక్తనాళాలు దెబ్బతింటాయట. ఇది గుండె సమస్యలకు పక్షవాతానికి దారితీస్తాయి. గుండె రక్తనాళాలు ఇంఫలమేషన్ వల్ల రాంబస్ లేదా రక్త గడ్డలు వస్తాయి. వాటి ఫలితంగా గుండెల్లోని భాగాలకు ఆక్సిజన్ పోషకాలు అందని పరిస్థితి రావచ్చు. ఇది దీర్ఘకాల ఇన్ఫలమేషన్ గుండె వైఫల్యానికి దారితీస్తాయి.అటువంటి పరిస్థితిలో శరీరానికి కావాల్సినంత రక్తాన్ని అవయవం సరఫరా అవ్వదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.. అలాగే ఎక్కువగా చక్కర తీసుకున్నట్లయితే..
టైప్ టు డయాబెటిస్కు అలాగే ఊబకాయం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో గుండె సంబంధిత వ్యాధులు, పక్షవాతం, నాడులు దెబ్బతిన్నడం, మూత్రపిండాల వైఫల్యం, వినికిడి , చూపు సామర్థ్యం తగ్గిపోవడం లాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే కూరగాయల్లో పండ్లలో ఉండే న్యాచురల్ షుగర్లు శరీరంపై పెద్దగా ప్రభావం చూపవని నిపుణులు చెప్తున్నారు.. రిఫైండ్ షుగర్ లాగా ఇవి బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను పెంచవచ్చు అని కూడా నిపుణులు ఓ పరిశోధన ద్వారా వెల్లడించారు.. కాబట్టి ఉప్పు షుగర్ తక్కువ తింటే గుండె సమస్యలు రావని చెప్తున్నారు…