Health Problems : పెళ్లయిన తర్వాత ప్రతి మహిళ ఈ పరీక్ష ఎందుకు చేయించుకోవాలో తెలుసా.?
Health Problems : పెళ్లి అయిన అనంతరం ప్రతి మహిళ కూడా ఈ పరీక్ష చేయించుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ప్రతి మహిళలో గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ తెలుసుకునేందుకు స్త్రీలు పరీక్ష చేయించుకోవాలని ఆరోగ్యం పనులు చెప్తున్నారు. లైంగికంగా చురుగ్గా ఉన్న తదుపరి గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అటువంటి మహిళలు పెళ్లి అయిన తర్వాత ఈ పరీక్షలు చేయించుకోవాలి.. ప్రపంచవ్యాప్తంగా సర్వైకల్ క్యాన్సర్ కేసులు అధికమవుతున్నాయి. ఈ క్యాన్సర్ స్త్రీలలో మరణానికి ప్రధాన కారణం అవుతున్నాయి. సర్వైకల్ క్యాన్సర్ హెచ్పీవీ వైరస్ వల్ల వ్యాపిస్తుంది.
ఈ వైరస్ లైంగిక సంపర్కం సమయంలో వ్యాపించే ఇన్ఫెక్షన్ ఇది. గర్భాశయంలోని దిగువ భాగమైన గర్భాశయం ముఖ ద్వారంలో ఉంటుంది. కావున దీనిని సర్వైకల్ క్యాన్సర్ అని పిలుస్తారు. ఈ క్యాన్సర్ ను తెలుసుకోవడానికి ఏ పరీక్ష ముఖ్యం. పెళ్లయిన తర్వాత మహిళలు ఏ పరీక్ష చేయించుకోవాలి. గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ ను తెలుసుకునేందుకు స్త్రీలు పరీక్ష చేయించుకోవాలని సీనియర్ గైనకాలజిస్ట్ వైశాలి గారు తెలియజేశారు. ఈ వ్యాధి లైంగికంగా చురుగ్గా ఉన్న తర్వాత గర్భవ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కావున అటువంటి స్త్రీలు పెళ్లి అయిన తర్వాత ఈ పరీక్ష చేయించుకోవాలని చెప్తున్నారు. లక్షణాలు కనిపించకపోయినా స్త్రీలు పరీక్ష చేయించుకోవాలి.
ఒక స్త్రీ సంభోగం సమయంలో పెల్విక్ నొప్పి వంటి లక్షణాలు అనుభవిస్తే అప్పుడు పాప్ స్పేర్లు పరీక్ష అవసరమని తెలియజేస్తున్నారు… కొంతమంది శృంగారంలో పాల్గొనడం చిన్న వయసులో లైంగికంగా చురుగ్గా ఉండటం కూడా ఈ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంటాయి. హెచ్ పి వి కంట్రోల్ చేయడానికి టీకా కూడా ఉంటుంది. వ్యాక్సిన్ 9 నుంచి 14 సంవత్సరాల వయసులో తీసుకోవచ్చు. గర్భాశయ క్యాన్సర్లు తగ్గించుకోవడానికి ఒక సాధారణ పరీక్ష కూడా చేయబడుతుంది. ఇప్పుడున్న కాలంలో వివాహం అయిన తర్వాత తప్పనిసరిగా పాప్ స్పియర్ టెస్ట్ చేయించుకోవాలని డాక్టర్ వైశాలి చెప్తున్నారు. ఈ పరీక్ష ప్రక్రియపై స్త్రీలలో అయిష్టత ఉంటుంది. అయితే ఇది చాలా సులభంగా జరుగుతుంది. ఈ పరీక్ష చేయడం వలన గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ని గుర్తించవచ్చు. దీనికి సకాలంలో చికిత్స కూడా చేయించుకోవచ్చు…