Hair Tips : బంగాళదుంపలో ఇది కలిపి రాశారంటే చాలు.. పలుచగా ఉన్న జుట్టు ఒత్తుగా అవుతుంది!
Hair Tips : ఈ మధ్య చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకూ అందరూ ఎదుర్కుంటున్న సమస్యలో ముఖ్యమైనది జుట్టు రాలడం. చాలా మంది ఈ సమస్య కారణంగా డిప్రెషన్ కు కూడా లోనవుతున్నారు. రోజంతా జుట్టు గురించే ఆలోచిస్తూ… మరిన్ని అనారోగ్య సమస్యలను కొని తచ్చుకుంటున్నారు. అయితే జుట్టు రాలిపోవడం, పలచగా ఉండడం, పొట్టిగా ఉండడం.. ఇలా పలు సమస్యల గురించి చెబుతుంటారు చాలా మంది. ఇలాంటి వాటికి ఉపశమనం కల్గించే ఒక మంచి చిట్కా గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీన్ని ఒక్కసారి ఉపయోగించిన ఉపయోగించినా సరే మన జుట్టులో చాలా మార్పు కనిపిస్తుంది. అంతేకాక జుట్టు రాలే సమస్య నుంచి పూర్తిగా ఉపశమనం లభిస్తుంది. అలాగే జుట్టు చాలా సిల్కీగా తయారు అవుతుంది.
దీన్ని వారానికి ఒకసారి అప్లై చేసుకోవాలి. దీన్ని వరుసగా మూడు నాలుగు సార్లు అప్లై చేసేసరికి మీకే మార్పు తెలుస్తుంది. జుట్టు ఊడిన చోట కొత్త జుట్టు వస్తుంది. ఈ రెమిడీ కోసం ముందుగా మనకు కావాల్సింది రెండు మీడియం సైజు బంగాళ దుంపలు. ముందుగా బంగాళ దుంపలను నీటితో శుభ్రం చేసి బాగా తురుముకోవాలి. లేదా మెత్తని పేస్టులా మిక్సీ పట్టుకోవాలి. ఈ తురుమును ఒక గిన్నెలో వేస్కొని బాగా బాయిల్ చేస్కోవాలి. దీని కోసం ఇందులో ఒఖ గ్లాస్ నీటిని వేస్కోవాలి. ఆ తర్వాత ఈ పేస్టును బాగా ఉడకనివ్వాలి. ఒక వేళ మీ జుట్టు గనుక బాగా పొడవుగా ఉంటే ఇంకొక బంగాళ దుంపను తీసుకోవచ్చు. ఇది బాగా ఉడికిన తర్వాత ఈ పేస్టును మెత్తని క్రీములాగా తయారు అవుతుంది.
ఆ తర్వాత ఈ పేస్టును బాగా చల్లారనిచ్చి మరలా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులో రెండు విటామిన్ ఇ క్యూప్సుల్స్ వేస్కోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని మన జుట్టుకు పాయలు పాయలుగా తీస్కొని బాగా అప్లై చేస్కోవాలి. ఈ పేస్టు కుదుళ్ల నుంచి చిగుళ్ల వరకు బాగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసిన తర్వాత రెండు గంటల పాటు బాగా ఆరనివ్వాలి. ఆ తర్వాత ఏదైనా మైల్డ్ షాంపూ ఉపయోగించి బాగా శుభ్రం చేస్కోవాలి. ఇలా శుభ్రం చేసిన తర్వాత మన హెయిర్ స్మూత్ అండ్ సిల్కీగా కనిపిస్తుంది. అంతే కాకుండా అప్లై చేసిన తర్వాత మన జుట్టు చిక్కు పడడం అనేది తగ్గుతుంది. దీనిలో విటామిన్ ఇ క్యూప్సుల్స్ బదులు కొబ్బరి నూనె లేదా ఆవ నూనెను కూడా ఉపయోగించవ్చు.