Hair Tips : తెల్ల జుట్టును నల్లగా, నిగనిగలాడే ఈ ఇంటి నూనె గురించి మీకు తెలుసా?
Hair Tips : ప్రస్తుత కాలంలో చిన్న వయసు వారిలో కూడా జుట్టు త్వరగా తెల్ల బడుతోంది. 50 ఏళ్ల తర్వాత తెల్ల బడాల్సిన జుట్టు… 20 ఏళ్లు దాటగానే తెల్లబడుతోంది. ఇందుకు ప్రదాన కారణం కాలుష్యం, రసాయన చికిత్సలు, అనారోగ్య కరమైన ఆహారంతో బిజీ జీవన శైలి, ఒత్తిడి, శారీరక అనార్గోయం, మానసిక ఆందోళనలు అకాల బూడిద మరియు జుట్టు నష్టానికి కొన్ని కారణాలు మాత్రమే. అయితే దీన్ని తగ్గించు కునేందుకు వేలకు వేలు డబ్బులు తగలేస్తూ.. పార్లర్ల చుట్టూ తిరగడం, రంగులు వేస్కోవడం చేస్తుంటారు. కానీ ఇలా చేయడం వల్ల చాలా మంది సైడ్ ఎఫెక్లు కూడా ఉంటాయి. అయితే ఇలాంటి వాటికంటే బదులుగా పలు జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు.
మనం కూరగా వండుకునే బీరకాయతో నూనె తయారు చేసుకొని వాడటం వల్ల తెల్లగా ఉన్న జుట్టు పూర్తి నల్లగా మారిపోతుంది.జుట్టు రాలడాన్ని ఎదుర్కోవడంలో బీరకాయ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మలినాలను తొలగించడం ద్వారా మీ జుట్టుకు షైన్ మరియు మెరుపును జోడించడం ద్వారా బూడిద రంగు జుట్టును ఆలస్యం చేయడం కూడా అదనపు ప్రయోజనం. ఆరోగ్యకరమైన జుట్టు కోసం ఇంట్లో తయారు చేసిన ఈ బీరకాయ హెయిర్ ఆయిల్ ను కూడా ప్రయత్నించండి. బీరకాయ బూడిద నివారణలో అత్యంత ప్రభావవంతమైన ఆహార పదార్థాల్లో ఒకటి. ఇది శరీరంలో వర్ణ ద్రవ్యాలను పునరుద్ధరించడానికి, జుట్టు మూలాలను బలోపేతం చేయడానికి సహాయ పడుతుంది.
బీరకాయ ఒకటి తీసుకొని కాయను చిన్న చిన్న ముక్కులుగా తరగాలి. వీటిని నీడలో మూడ్రోజుల వరకూ ఆరబెట్టండి. ఈ ఎండిన ముక్కలను ఒక గ్లాసు జార్లో వేసి కప్పు కొబ్బరి నూనెలో 3 నుంచి 4 రోజులు నానబెట్టండి. తర్వాత ఇప్పుడు నూనె నల్లగా మారే వరకూ కొబ్బరి నూనెను తక్కువ మంట మీద మరిగించండి. నూనెను వడకట్టి నిల్వ చేయండి. గరిష్ట ప్రయోజనాల కోసం ఈ నూనెను వారానికి 2, 3 సార్లు అప్లై చేయండి. రాత్రి సమయంలో ఈ నూనెను జుట్టుకు అప్లై చేసి ఉదయాన్నే తలస్నానం చేయాలి. బీరకాయ శరీరంలో ఉండే మెలానిన్ శాతాన్ని పునరుద్ధరిస్తుంది. ఇది తెల్ల జుట్టును నల్లగా మార్చేందుకు చాలా బాగా సాయపడుతుంది.