Health Benefits : కరివేపాకు జ్యూస్ తో అద్భుతమైన ప్రయోజనాలు… తీసుకోకపోతే ప్రమాదంలో పడినట్లే…!!
Health Benefits : కరివేపాకు లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ కరివేపాకును వంటల్లో వాడడంతో వంటకి సువాసన తో పాటు రుచి కూడా పెరుగుతుంది.. ఇది రుచికి మాత్రమే కాకుండా మన జీర్ణ క్రియ కు చాలా బాగా ఉపయోగపడుతుంది. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. కరివేపాకును మనం వంటల్లో బాగా వాడుతూ ఉంటాం.. కరివేపాకు కొత్తిమీర లేకుండా వంటలు పూర్తి అవడం చాలా కష్టం. అయితే చాలామంది కూరలు టిఫిన్స్ లో కరివేపాకు తినకుండా పడేస్తూ ఉంటారు. వీటిని తినడం వల్ల కలిగే ఉపయోగాలు తెలిస్తే ఇక దాన్ని అసలు పడేయరు. కరివేపాకు మన జీర్ణ క్రియను మెరుగుపరచడమే కాక శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ను కరిగిస్తుంది. అలాగే కంటికి, గుండెకి చాలా మేలు చేస్తుంది.
కరివేపాకు కూరల్లో తినడం కష్టంగా అనిపించేవారు దాన్ని రసం రూపంలో కూడా చేసుకొని త్రాగవచ్చు. అని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే అసలు ఈ కరివేపాకు ఎలా జ్యూస్ తయారీ.. దాన్ని తీసుకోవడం వలన కలిగే ఉపయోగాలు ఏంటి ఇప్పుడు మనం చూద్దాం.. తయారీ విధానం: కరివేపాకు రసం తయారు చేయడానికి పెద్దగా కంగారు పడవలసిన అవసరం లేదు. శుభ్రం చేసిన కరివేపాకును మిక్సీలో వేసి పేస్టులా పట్టుకోవాలి. కరివేపాకు ఆకులను మెత్తగా దంచినా కూడా పర్వాలేదు. గ్రైండర్ లేదా మిక్సర్ లేని వారు ఒక గిన్నెలో వాటర్ పోసి కరివేపాకుల్ని గ్యాస్ మీద పెట్టి సన్నని మంట మీద 20 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఈ కరివేపాకు ఆకులు గోధుమ రంగులోకి వచ్చిన తర్వాత నీటిని వడకట్టి కరివేపాకును తీసివేసుకోవాలి. ఈ విధంగా చేసిన జ్యూస్ తయారవుతుంది. ఈ కరేపాకు రసం వల్ల కలిగే ఉపయోగాలు: *కరివేపాకు జ్యూస్ తీసుకోవడం వలన రక్తపోటు కంట్రోల్లో ఉంటుంది.
*మరో ప్రధానమైన విషయం ఏమిటంటే కరివేపాకు తీసుకోవడం వలన జ్యూస్ తాగడం వలన జుట్టు సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి. *బరువు తగ్గాలనుకునే వారు కరివేపాకు జ్యూస్ తాగడం వలన మంచి ఉపయోగం ఉంటుంది. దానికి తగ్గ శారీరక శ్రమ కూడా చేయవలసి ఉంటుంది. *కొవ్వు కరిగించడంలోనూ కరివేపాకు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కొవ్వు వలన రక్తం సరఫరా అవ్వదు. అటువంటి అప్పుడు కరివేపాకు తింటే లేదా జ్యూస్ తాగితే మీ ఆరోగ్యానికి మంచి మేలు జరుగుతుంది. *కరివేపాకు జ్యూస్ నిత్యం తీసుకోవడం వలన బాడీ డిటాక్స్ అవుతుంది. దాని ద్వారా కడుపులో తిప్పడం, వికారం లాంటివి సమస్యలు నుంచి బయటపడవచ్చు.. *అతివేగంగా తినేవారికి అజీర్తి సమస్యలు వస్తుంటాయి. అప్పుడు కరివేపాకు తీసుకోవడం వలన అలాగే కరివేపాకు జ్యూస్ తాగడం వలన అజీర్తి సమస్య తగ్గిపోతుంది. జీర్ణక్రియ సరిగా జరిగి సమయానికి ఆకలి వేస్తుంది..