Health Benefits : బొప్పాయి గురించి ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు…!!
Health Benefits : మనం ఆరోగ్యంగా ఉండడానికి ముఖ్య కారణం మంచి ఆహారం. అలాగే జీవన విధానం కూడా ఎంత ఆరోగ్యంగా ఉన్నా ఎంత పౌష్టికాహారం తీసుకుంటున్న పెరిగిన పొల్యూషన్ కారణంగా చాలామంది రోగాల బారిన పడుతున్నారు. మరి ఈ సమస్య నుంచి మనం తప్పించుకోవాలి అంటే కేవలం సహజసిద్ధంగా దొరికిన పండ్లు కూరగాయల ద్వారానే సాధ్యం. మరి మన ఆరోగ్యాన్ని సంరక్షిస్తూ మనం రోగాల బారిన పడకుండా మనల్ని సంరక్షించే పండ్లు చాలానే ఉంటాయి. వాటిలో మనం ఈరోజు బొప్పాయి పండు గురించి పూర్తిగా తెలుసుకుందాం. మనం ఆరోగ్యంగా ఉంటూ రోగాల బారిన పడకుండా ఉండాలి అంటే మంచి పౌష్టికాహారం తీసుకోవాలి ఇలా పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే మన లోపల ఉండే ప్రతి అవయవాలకు కావలసిన పోషకాలు సమపాళ్లలు అంది ఆరోగ్యంగా ఉంటాయి.
మరి బొప్పాయి పండు మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అది ఎలా తినాలి? ఎంత మోతాదులో తినాలి ఎవరు తినకూడదు అనే విషయాలు కూడా పూర్తిగా చూద్దాం పెరిగిన పొల్యూషన్ కారణంగా తరచుగా చాలామంది జ్వరాల బారిన పడుతున్నారు. డెంగ్యూ అని మలేరియా అని ఇటువంటి విషయ జ్వరాల బారిన పడి కొంతమంది కృంగిపోతుంటే..కొంతమంది కోలుకోవడానికి చాలా సమయం తీసుకుంటున్నారు. ఇలాంటి జ్వరాలు ఉన్నప్పుడు బొప్పాయి తీసుకుంటే ఈ బొప్పాయిలో యాంటీ మలేరియా లక్షణాలు ఉంటాయి. అంతేకాకుండా డెంగ్యూ జ్వరాన్ని కూడా చక్కగా నయం చేయగలదు. బొప్పాయి కేవలం బొప్పాయి పండు మాత్రమే కాకుండా బొప్పాయి ఆకులను కూడా ఇలా డెంగ్యూ ఫీవర్ ఉన్నవాళ్లు తీసుకుంటే రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య పెరిగి డెంగ్యూ జ్వరం నుంచి త్వరగా కోలుకోవచ్చు.
అలాగే పండిన బొప్పాయి పండును తీసుకుని దానికి కొంచెం నిమ్మరసం యాడ్ చేసి తీసుకుంటే మంచి రుచితో పాటు విటమిన్ సి కూడా మన శరీరానికి అందుతుంది. అయితే డెంగ్యూ జ్వరంతో బాధపడేవాళ్లు రోజుకి రెండు మూడు సార్లు ఈ జ్యూస్ ని తీసుకోవచ్చు. ఒకవేళ డెంగ్వు జ్వరం ఉంటే అంటే ప్లేట్ల సంఖ్య విపరీతంగా పడిపోయి ఉంటే బొప్పాయి ఆకుల జ్యూస్ చేసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల కాకరకాయ రసం కలుపుకుని తాగితే త్వరగా డెంగ్యూ జ్వరం నుంచి బయటపడొచ్చు. అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. రోజు ఒక ముక్క బొప్పాయి తీసుకుంటూ ఉంటే అరుగుదల శక్తి మెరుగవుతుంది. అలాగే పేగుల శుభ్రం అవుతాయి. మలబద్ధకం సమస్య పోతుంది. అంతేకాకుండా మన శరీరంలో ఉన్న విష వ్యర్ధాలు అన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. జీర్ణశక్తి పెరుగుతుంది. బొప్పాయిలో మనకి ఫ్లవర్ పొటాషియం, మినరల్స్, మెగ్నీషియం, ఫైబర్ మొదలైన పదార్థాలు ఉంటాయి.
బొప్పాయిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి అధిక బరువు ఒబిసిటీతో బాధపడే వాళ్ళు కూడా బొప్పాయిని ఈజీగా తినొచ్చు. ఎందుకంటే ఇందులో ఉండే పీచు పదార్థం మన కడుపుని ఎలా అయితే శుభ్రం చేసి వ్యర్ధాలను పోగొడుతుందో మన కడుపుని కూడా చక్కగా నింపుతుంది. తొందరగా ఆకలి కూడా వేదు కాబట్టి బరువు పెరుగుతారు. అనే భయం కూడా అవసరం లేదు. క్యాన్సర్ వంటివి కూడా చక్కగా నయమవుతాయి అంటున్నారు కొంతమంది వైద్య నిపుణులు. అలాగే కంటి సమస్యలతో బాధపడేవారు అంటే దృష్టిలోపం కానీ కళ్ళ వెంబడి నీరు రావడం కానీ కళ్ళు ఎర్రబడ్డం వాయడం ఇలాంటి సమస్యలతో ఉన్నవాళ్లు బొప్పాయి తీసుకుంటే కంటి దృష్టి మెరుగవుతుంది. అలాగే కళ్ళల్లో ఉండే ఎరుపుదనం తగ్గి కళ్ళు దురదలు ఉండవు.. అలాగే నీరు కారే సమస్య కూడా తగ్గుతుంది.
ఇక పంటికి కూడా చాలా మేలు చేస్తుంది. బొప్పాయి నారింజ ఆపిల్ లో కంటే కూడా బొప్పాయిలో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. ఆయిల్ స్కిన్ తో బాధపడే వాళ్ళు బొప్పాయితో ఫేస్ ప్యాక్ వేసుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. మన శరీరంలో జరిగే మెటబాలిజమ్ ప్రక్రియలు ఫ్రీ రాడికల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి కదా.. ఇవి శరీరానికి అనేక రకాల రోగాలను కలిగిస్తాయి. మరి ఇలా ఫ్రీ రాడికల్స్ ద్వారా మనం జబ్బు పడితే కనుక యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. అది బొప్పాయిలో సమృద్ధిగా ఉంది. కాబట్టి బొప్పాయి పండు తీసుకుంటే ఫ్రీ రాడికల్స్ నుంచి చక్కని విముక్తి ఉంటుంది. బొప్పాయి పండులో ఉండే కెరిటోనాయిడ్ యాంటీ ఆక్సిడెంట్ లో పనిచేస్తాయి. ఫ్రీ రాడికల్స్ ను నాశనం చేసి శరీరాన్ని రక్షిస్తాయి..