Health Benefits : రోజుకోసారి ఈ డ్రింక్ తాగితే చాలు.. జిమ్ కు వెళ్లాల్సిన పనే లేదు!
Health Benefits : రోజూ మనం తినే తిండి, చేసే పనుల ఆధారంగానే బరువు పెరగడం లేదా తగ్గడం వంటివి జరుగుతాయి. ఈ విషయం మనం అందరికీ బాగా తెలుసు. అయితే సన్నగా ఉన్న వాళ్లు కాస్త సులువుగానే లావు అవ్వొచ్చు… కానీ లావుగా ఉన్న వాళ్ల సన్నగా అవ్వాలంటే చాలా చెమటోడ్వాల్సిందే. అంటే వ్యాయామం చేయడం, డైట్ ఫాలో అవ్వడం వంటివి తప్పనిసరి. అయితే డైట్ పేరుతో చాలా మంది బరువు తగ్గేందుకు నీళ్లు తాగడం సహా రాత్రిళ్లు భోజనం తీసుకోవడం మానేస్తారు. ఎక్కువ సేపు జిమ్ లోనే గడుపుతూ అనేక అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటారు. అయితే ఎలాంటి సమస్యలు రాకుండా, జిమ్ కి వెళ్లకుండానే మీ బరువును తగ్గించుకోవచ్చు.
అయితే అదెలాగో మనం ఇఫ్పుడు తెలుసుకుందాం.అయితే ముందుగా ఒక గిన్నెలో గ్లాసునర నీల్లు పోసి మరిగించాలి. మీకు ఒక రోజుకి సరిపడా ఆహారం కావాలంటే ఒకేసారి ఒక లీటర్ నీటితో చేసుకోవాలి. అందులో మూడు బిర్యానీ ఆకులు వేయాలి. అలాగే రెండు యాలకులు తీసుకొని ఒలిచి వేసుకోవాలి. తర్వాత దాల్చిన చెక్కు ముక్క, జీలకర్ర కూడా వేయాలి. ఆ తర్వాత వీటిని ఒక 15 నిమిషాల పాటు బాగామరిగించుకోవాలి. బాగా మరిగి రంగు మారాక నీటిని వడకట్టాలి. తర్వాత వీటిని పారేయకుండా బిర్యానీ ఆకు, పెరుగు మిక్సీ చేసి ముఖానికి కూడా అప్లై చేసుకోవచ్చు. దీని వల్ల ఏపెన్ పోర్స్ సమస్యతో పాటు మొహంపై మచ్చలు ఉండటం వంటి అనేక సమస్యలు తగ్గుతాయి.బిర్యానీ ఆకులు శరీర బరువును తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి.
వీటిలో ఉండే షధ గుణాలు ఇన్సులిన్ ని క్రమబద్ధం చేసి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి డయాబెటిస్ ను అదుపులో ఉంచుతుంది. అలాగే యాలకుల వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. జీవక్రియ రేటును పెంపొందించడంలో యాలకులు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అలాగే తిన్న ఆహారాన్ని బాగా జీర్ణం చేయడంలోనూ, నిద్రలేమి సమస్యను తరిమికొట్టడంలోనూ ముందుటుంది. దాల్చిన చెక్క వల్లశరీరలో పేరుకుపోయిన కొవ్వు కణాలు కరిగిపోతాయి. ఇలా మరిగించిన నీటిని ప్రతి రోజూ తాగడం మూడు సార్లు తీసుకోవాలి. ఉదయాన్నే ఒకసారి, మధ్యాహ్నం, సాయంత్రం కూడా తీసుకోవాలి. అయితే దీన్ని ఎప్పటికప్పుడు అయినా ఒకేసారి అయినా తయారు చేసుకోవచ్చు. ఉదయం పరగడపున, మధ్యాహ్నం భోజనానికి ముందు, రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోవడం మరింత మంచిది.