Migraine : భరించలేని మైగ్రేన్ నికూడా శాశ్వతంగా తగ్గించే అద్భుతమైన చిట్కాలు..!
Migraine : చాలామంది మైగ్రేన్ తలనొప్పితో ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. మైగ్రేన్ ప్రాబ్లం ఉన్నవాళ్లు స్వీట్స్ ఎక్కువగా తినకూడదు. ఇది మగవారిలో కొంతమందికి స్త్రీలలో అధికంగా కనిపిస్తోంది. ఇది చాలా వరకు తలకు ఒక పక్క వస్తుంది. తలలోని రక్తనాళాలు వాయటం వల్ల ఈ నొప్పి వస్తుంది. చాలామంది మైగ్రేన్ తలనొప్పి తలలో ఒకవైపే వస్తుందని భావిస్తుంటారు. కానీ కొన్నిసార్లు రెండు వైపులా కూడా వస్తుంది. ఈ రకం తలనొప్పి తీవ్రంగా ఉంటుంది. తలలో కొట్టుకుంటున్నట్లుగా నొప్పి వస్తు పోతూ ఉంటుంది. తగ్గుతూ మరియు తీవ్రమవుతున్నట్లు ఉంటుంది. ఇలాంటి సందర్భంలో కొంతమందికి వాంతులు అవుతాయి. కొందరికి నొప్పి వచ్చినప్పుడు ఎవరన్నా మాట్లాడితే చికాకుగా ఉంటుంది. శబ్దాలు వినబుద్ధి కాదు.. వెలుతురు చూడబుద్ధి కాదు.. మైగ్రేన్ తలనొప్పి వచ్చేవారికి ప్రయాణం చేసిన ఎండలో ఎక్కువ తిరిగిన భోజనం ఆలస్యమైనా లేదా అన్నం తినకపోయినా నిద్ర తక్కువైనా లేదా ఎక్కువైనా ఇలాంటి సందర్భాలలో ఈ రకం తలనొప్పి వస్తుంది.
వంశంలో ఎవరికైనా ఉంటే వారి యొక్క తరువాతి తరం వారికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలా మైగ్రేన్ తలనొప్పితో ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారికి నిమ్మ ఆకులతో చెక్ పెట్టవచ్చు. అది ఎలానో తెలుసుకుందాం. మైగ్రేన్ తలనొప్పితో బాధపడేవారు తాజా నిమ్మ ఆకులను కోసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఒక కప్పు నీటిని బాగా మరిగించి నీటిని దించి ఆ వేడి నీటిలో గుప్పెడు నిమ్మ ఆకులను వేయాలి. తరువాత దానిపై మూత పెట్టాలి. 15 నిమిషాలు ఆగాక గోరువెచ్చగా ఉండగా వడకట్టుకొని రుచికి తేనె కలుపుకొని రాత్రి పడుకునే ముందు కప్పు కషాయం లేదా టీ ని తాగాలి.
ఈ విధంగా రెండు వారాలు తాగాలి. ఇలా తాగుతుంటే మంచి ఫలితాన్ని మీరు చూస్తారు.. ఇలా చేస్తూ ఆందోళన తగ్గించుకోవాలి. అతిగా ఆలోచన చేయకూడదు. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. దీని కోసం యోగ ప్రాణాయామం చేయాలి. ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుంది. కాషాయం లేదా టీ ని తాగుతుంటే మీరు మైగ్రేన్ బాధ నుండి తప్పకుండా బయటపడతారు…