Migraine : మైగ్రేన్ సమస్యకు నాలుగు ప్రధాన కారణాలు ఉన్నాయి… అవి ఏమిటో తెలుసుకోండి…!
Migraine : ప్రస్తుత కాలంలో మైగ్రేన్ సమస్య చాలా సాధారణ సమస్యగా మారింది. అయితే ఎంతో మంది దీని నుండి ఉపశమనం పొందటానికి డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నారు. అయితే మీరు ఏదైనా సమస్యను పరిష్కరించేందుకు ముందు దాని యొక్క కారణాన్ని తెలుసుకోవాలి. అయితే ఈ మైగ్రేన్ కు నాలుగు ముఖ్య కారణాలు ఉన్నాయి. అలాగే ఈ మైగ్రేన్ రావడానికి కారణం ఏంటి మరియు దానిని ఎలా తగ్గించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ […]
ప్రధానాంశాలు:
Migraine : మైగ్రేన్ సమస్యకు నాలుగు ప్రధాన కారణాలు ఉన్నాయి... అవి ఏమిటో తెలుసుకోండి...!
Migraine : ప్రస్తుత కాలంలో మైగ్రేన్ సమస్య చాలా సాధారణ సమస్యగా మారింది. అయితే ఎంతో మంది దీని నుండి ఉపశమనం పొందటానికి డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నారు. అయితే మీరు ఏదైనా సమస్యను పరిష్కరించేందుకు ముందు దాని యొక్క కారణాన్ని తెలుసుకోవాలి. అయితే ఈ మైగ్రేన్ కు నాలుగు ముఖ్య కారణాలు ఉన్నాయి. అలాగే ఈ మైగ్రేన్ రావడానికి కారణం ఏంటి మరియు దానిని ఎలా తగ్గించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ మైగ్రేన్ నొప్పికి ఖచ్చితమైన కారణాన్ని స్పష్టంగా చెప్పలేము. కానీ మెదడు పనితీరులో మార్పులు మరియు మెదడులో రసాయన మార్పులు మరియు జన్యు పర్యావరణ కారకాలు కూడా వీటికి కారణాలు కావచ్చు. అయితే ముఖ్యంగా ఈ మైగ్రేన్ కి మనం తీసుకున్నటువంటి ఆహారానికి సంబంధం ఉంది అని చాలా మందికి తెలియదు. అయితే ఈ మైగ్రేన్ సమస్యను తగ్గించేందుకు సమతుల్య ఆహారం చాలా ముఖ్యం. ఈ మైగ్రేన్ సమస్యతో బాధపడేవారు పాల ఉత్పత్తులు మరియు గుడ్లు పుల్లని ఆహారాలు మరియు గ్లూటేన్ కలిగినటువంటి ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది. అలాగే మైగ్రేన్ కి హార్మోన్ల అసమతుల్యత కూడా కారణం కావచ్చు. అయితే మహిళల్లో ఈ సమస్య అధికంగా రావడానికి కారణం ఇదే. అలాగే మహిళల్లో రుతు స్రావం టైంలో హార్మోన్ల అసమతుల్యత అనేది ఏర్పడుతుంది. దీంతో మైగ్రేన్ సమస్యకు దారి తీస్తుంది. అయితే మీరు ఆల్కహాల్ మరియు ఎక్కువ చక్కెర, పిండి పదార్థాలను కూడా తగ్గించాలి.
అలాగే మెగ్నీషియం లోపం కూడా మైగ్రేన్ కు కారణం అవుతుంది. కావున మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటే మంచిది. అలాగే వైద్యులను సంప్రదించి మెగ్నీషియం టాబ్లెట్స్ ను వాడాల్సి ఉంటుంది. అలాగే గట్ లో ఉండే బ్యాక్టీరియా వల్ల కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. కావున వెంటనే చికిత్స చేయించుకోవడం చాలా అవసరం. అలాగే మీరు తీసుకునేటటువంటి ఆహారంలో ప్రోబయోటిక్స్ మరియు ఒమేగా త్రీ లాంటి పుష్కలంగా ఉండేటటువంటి ఆహారాలను తీసుకోవాలి. ఇది పేగుల అసమతుల్యతను సరి చేసేందుకు మరియు గట్ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది…