Heart Attack : ఈ ఏడు అలవాట్లు ఉన్నాయా.. గుండెపోటు వస్తుంది జాగ్రత్త..!
ప్రధానాంశాలు:
Heart Attack : ఈ ఏడు అలవాట్లు ఉన్నాయా.. గుండెపోటు వస్తుంది జాగ్రత్త..!
Heart Attack : ఈ రోజుల్లో ఎక్కువగా గుండెపోటు మరణాలు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ మరణాలే ఎక్కువగా ఉంటున్నాయి. ఒకప్పుడు అసలు గుండెపోటు మరణాలు అనేవి చాలా అసాధారణంగా జరిగేవి. కానీ కరోనా తర్వాత ఎక్కువగా ఇలాంటి మరణాలే సంభవిస్తున్నాయి. ఒకప్పుడు యాభై ఏండ్లు దాటిన వారిలో ఈ మరణాలు కనిపించేవి. కానీ ఇప్పుడు చిన్న వయసు వారికి కూడా ఇవి వస్తున్నాయి. అయితే ఈ గుండెపోటు మరణాలు రావడానికి ప్రధానంగా ఏడు అలవాట్లు ఉండటేమనని చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం.
Heart Attack : డెస్క్ ఉద్యోగాలతో..
ఈ రోజుల్లో కూర్చుని పని చేసే డెస్క్ ఉద్యోగాలు చాలా ఎక్కువ అయిపోయాయి. గంటల తరబడి కూర్చుని పని చేస్తుననారు. దాంతో శారీరక శ్రమ లేకుండా పోతోంది. దాంతో అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. వాటి వల్ల గుండెపోటు మరణాలు కూడా సంభవిస్తున్నాయి.మన దేశంలో ఎక్కువగా కొవ్వు, చెక్కరతో పాటు ప్రాసెస్ చేసినఫుడ్ నుతింటూ ఉంటారు. దాని వల్ల అధిక కొలెస్ట్రాల్ మన బ్లడ్ లో తయారవుతుంది. దాని వల్ల కూడా గుండెపోటు మరణాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.
ఇక మన దేశంలో డయాబెటిక్ పేషెంట్లు చాలా ఎక్కువగానే ఉంటున్నారు. ఇటీవల కాలంలో ఈ వ్యాధిగ్రస్తులు బాగా పెరిగిపోతున్నారు. అయితే ఈ డయాబెటిక్ వ్యాధి గ్రస్తులకు కూడా గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. కాబట్టి ఇవి రాకుండా ఉండటానికి జాగ్రత్తలు తీసుకోవాలి.ప్రస్తుతం అందరూ ఉరుకుల పరుగుల జీవితాలను గడుపుతున్నారు. అందులోనూ పని ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలతో పాటు లైఫ్ స్టైల్ లో మార్పులు కూడా ఈ రోజుల్లో ఒత్తిడి స్థాయిలను బాగా పెంచేస్తున్నాయి. దాని వల్ల గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి.
మన దేశంలో మెట్రో నగరాలు ఢిల్లీ, ముంబై, బెంగళూరు లాంటి నగరాల్లో పేలవమైన గాలి నాణ్యత సూచిక కారణంగా గుండె వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు.ఇక పొగాకు, లేదా సిగరెట్ తాగేవారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. పొగతాగే వారికి గుండెపోటు వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ఈ రోజుల్లో శారీరక శ్రమ బాగా తగ్గిపోతోంది. దానికి తోడు వ్యాయామాలు కూడా అస్సలు చేయట్లేదు. అంతే కాకుండా సమయానికి తగ్గట్టు చికిత్సలను కూడా తీసుకోవట్లేదు. దాని వల్ల కూడా గుండె పోటు వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.