Onions in Winter : చలికాలంలో ఉల్లిపాయలు తింటున్నారా….? అయితే దిమ్మ తిరిగే బెనిఫిట్స్…!
Onions in Winter : శీతాకాలంలో రోజు పచ్చి ఉల్లిపాయలు ఒకటి లేదా రెండు తినడం వల్ల చర్మం కాంతివంతంగా ఉంటుంది. అంతే కాదు ఉల్లిపాయల్లో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల జుట్టు రాలే సమస్య కూడా తగ్గిపోతుంది. జుట్టు ఒత్తుగా పెరగటానికి సహాయపడుతుంది. ఉల్లిపాయ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం. మన వంటింట్లోనే మన ఆరోగ్యానికి సంబంధించిన అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి. మనం చేసే వంటలో కూడా ఉల్లిపాయకి అతి ముఖ్యమైన స్థానం ఉంది. ఎందుకంటే ఉల్లిపాయ లేనిదే వంట చేయలేం. ఉల్లిపాయ లేని వంట రుచికరంగా ఉండదు.అయితే ఉల్లిపాయల్లో రెండు రకాలు ఉన్నాయి.ఒకటి చిన్న ఉల్లిపాయ, ఒకటి పెద్ద ఉల్లిపాయ. ఇందులో పెద్ద ఉల్లిపాయ కంటే చిన్న ఉల్లిపాయల్ని ఎక్కువ పోషకాలు కలిగి ఉంటాయి. అందుకే దీన్ని పచ్చిగా తింటే మరిన్ని ఫలితాలను పొందవచ్చు అని పూర్వీకులు చెప్పేవారు. అయితే ముఖ్యంగా చలికాలం ఉల్లిపాయలు తినడం వల్ల ఎన్నో రకాల లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాల అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా గుండె సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.
విటమిన్ సి, విటమిన్ బి 6, పొటాషియం,మెగ్నీషియం అంటే పోషకాలు చిన్న ఉల్లిపాయలల్లో పుష్కలంగా లభిస్తాయి. ఇవన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సాధారణంగా చలికాలంలో జలుబు, దగ్గు,జ్వరం,అంటే అంటువ్యాధులు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి. కావున వీటిని చలికాలంలో ఎక్కువగా తినడం వల్ల చలికాలంలో వచ్చే అంటి వ్యాధులను దూరంగా ఉండవచ్చు.
చిన్న ఉల్లిపాయ ప్రకృతిలో వేడిగా ఉంటుంది. అందుకే చలికాలంలో పచ్చి ఉల్లిపాయలు తింటే శరీరం వెచ్చగా ఉంటుంది. ఇలాగే చలికాలంలో వచ్చే గుండెపోట్లు కూడా ఈ ఉల్లిపాయ తినడం వల్ల హార్ట్ ఎటాక్ రాకుండా కాపాడుకోవచ్చు. ఎందుకంటే ఉల్లిపాయలు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. శరీరానికి అసౌకర్యమైన కొలెస్ట్రాలను తగ్గించడంలో సహాయపడతాయి. అందువల్ల శీతాకాలంలో ఉల్లిపాయలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తపోటు మెరుగుపరుస్తుంది. అధిక రక్తపోటు తగ్గుతుంది.
చిన్న ఉల్లిపాయల్లో గ్లైసి మీకు ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా మేలు చేస్తుంది. కాబట్టి చలికాలంలో రక్తంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉంచుకోవడానికి, దీని రోజు తీసుకోవాలి. చలికాలంలో రోజు ఒకటి లేదు రెండు పచ్చి ఉల్లిపాయలు తింటాను చర్మ మెరుస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఉల్లిపాయలు ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల జుట్టు రాలడాన్ని వివరిస్తుంది. చుట్టుకు పెరుగుదలకు మంచి ఔషధం. పొడవు జుట్టు లేని వారికి ఈ పచ్చి ఉల్లిపాయల్ని రోజు రెండు తినండి. పొడుగు జుట్టు ఒత్తయిన అందమైన జుట్టు మీ సొంతం అవుతుంది. రక్తహీనత కూడా తగ్గించి హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. ఈ పచ్చి ఉల్లిపాయల వల్ల ఇన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. Are you eating onions in winter , But the benefits are staggering