Heart Attack : ఆ సమయంలో పాదాలు చల్లగా మారుతున్నాయా.. అయితే గుండెపోటు వచ్చే ప్రమాదం..!
Heart Attack : ఈ రోజుల్లో గుండెపోటు మరణాలు చాలా ఎక్కువ అయిపోతున్నాయి. ఒకప్పుడు అసలు గుండెపోటు మరణాలు చాలా అరుదుగా కనిపించేవి. కానీ ఇప్పుడు మాత్రం చాలా ఎక్కువ అయిపోతున్నాయి. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల్లో కూడా కనిపిస్తున్నాయి. అయితే గుండెపోటు లక్షణాలను ముందే గుర్తిస్తే మాత్రం దాన్ని అరికట్టవచ్చని అంటున్నారు. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగితే అవి గుండెపోటుకు దారి తీస్తుంటాయి. అయితే ఈ కొలెస్ట్రాల్ స్థాయిలను ముందే గుర్తించాలని డాక్టర్లు చెబుతున్నారు. అయితే దీన్ని ఎలా పసిగట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం…
Heart Attack లక్షనాలు ఇవే..
మరీ ముఖ్యంగా పాదాలలో చెడు కొలెస్ట్రాల్ లక్షణాలు సులభంగా కనిపిస్తాయి. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగితే మాత్రం దాన్ని ప్రారంభ లక్షణంగా చెప్పుకోవచ్చు. ఆ సమయంలో మనం కొంచెం నడిచినా సరే లేదంటే ఎక్కువ సేపు పని చేస్తున్నా మనకు శ్వాస సంబంధిత సమస్యలు వస్తుంటాయి. అయితే శ్వాస ఆడకపోవడానికి వేరే కారణాలు కూడా ఉంటాయి. బ్లడ్ టెస్టులు లేకుండా కొలెస్ట్రాల్ పెరిగిందని మనం అనుకోవడానికి లేదు. కొలెస్ట్రాల్ సమస్యలు వస్తే మాత్రం పాదాలలో సమస్యలు సులభంగానే కనిపిస్తాయి. ఎలా అంటే కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగితే పాదాలు రాత్రి సమయంలో చల్లగా మారుతాయి.
అయితే ఏ సీజన్ అయినా సరే అంటే వేసవి, చలికాలం, వర్షాకాలం ఇలా ఏ కాలం అయినా సరే కొలెస్ట్రాల్ పెరిగితే మాత్రం పాదాలు రాత్రి సమయంలో చల్లగానే మారుతుంటాయి. అలా చల్లగా మారితే మాత్రం కచ్చితంగా చెడు కొలెస్ట్రాల్ పెరిగిందని అర్థం చేసుకోవాలి. కొన్ని సార్లు కాలి చీలమండల్లో అనుకోని వాపులు కూడా కనిపిస్తుంటాయి. అవి కూడా చెడు కొలెస్ట్రాల్ పెరుగుదలకు కారణంగానే భావించాలి. ఈ లక్షణాలు గనక మీలో కనిపిస్తే మాత్రం వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. ఈ లక్షణాలు ఉన్నప్పుడు అరికాళ్లలో మంటగా కూడా ఉంటుంది.
ఈ లక్షనాలు ఉంటే బాడీలో వాతం ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. ఈ లక్షణాలను ముందే గుర్తించి ట్రీట్ మెంట్ తీసుకుంటే గుండెపోటు నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.