Mango Leaves : చెడు కొలెస్ట్రాల్, మధుమేహం సమస్యలకి ఈ మామిడి ఆకులతో చెక్ పెట్టవచ్చు..!!
Mango Leaves : ప్రస్తుతం మనం జీవిస్తున్న జీవనశైలి విధానంలో కొన్ని మార్పులు వలన కొలెస్ట్రాల్, మధుమేహం సమస్యలు చాలా మందిని వేధిస్తున్నాయి. ఈ సమస్యలు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇటువంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు తప్పకుండా ఈ జాగ్రత్తలు వహించాలి. లేదంటే చెడు కొలెస్ట్రాల్ పెరగడం కారణంగా గుండె సమస్యలాంటి వచ్చే అవకాశాలు ఉంటాయి. భారత వ్యాప్తంగా షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య సుమారు 80 మిలియన్ల దాటింది. కావున ఇటువంటి రెండు ప్రమాదకరమైన సమస్యలతో ఇబ్బంది పడేవారు తప్పకుండా శరీరంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. అయితే వైద్యుల్ని సంప్రదించి కొన్ని జాగ్రత్తలు వహించాలి. అలాగే ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని చిట్కాలను పాటించడం
వలన కూడా సులభంగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.. ఉబ్బసం ,మధుమేహం లాంటి సమస్యలతో బాధపడేవారు ఆయుర్వేద నిపుణులు సూచించిన మామిడాకుల రసాన్ని తీసుకోవాలి. ఈ ఆకులలో పోషకాలు అధికంగా ఉండటమే కాకుండా గ్లూకోజ్ లెవెల్స్ కూడా తక్కువ పరిమాణంలో పొందవచ్చు. కావున త్రీవ్ర మధుమేహంతో ఇబ్బంది పడేవారు నిత్యం మావిడాకులతో తయారుచేసిన రసాన్ని తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవచ్చు.. మామిడి ఆకులతో ఉపయోగాలు.. మామిడాకులలో ఫైబర్, విటమిన్ సి లాంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇది మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించడానికి ఉపయోగపడతాయి.
అలాగే ఈ ఆకుల రసంలో ఇన్సులిన్ ఉత్పత్తిలో మార్పులు తీసుకువచ్చే చాలా రకాల ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. కావున సులభంగా బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ ఆకులు మధుమేహం లక్షణాలను తగ్గించడానికి సహాయపడతాయి. రాత్రిపూట పదేపదే మూత్ర విసర్జన అసిస్టమైన దృష్టి అధిక బరువు లాంటి సమస్యల నుంచి ఉపసనం కలగడానికి ఉపయోగపడుతుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కావున అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ మామిడి ఆకుల రసం తయారీ విధానం.. మామిడాకుల రసం తయారు చేయడానికి 15 తాజా మామిడాకులను
వంద నుంచి 150 ఎమ్ ఎల్ నీటిలో వేసి బాగా మరగబెట్టాలి. ఇప్పుడు ఈ నీటిని రాత్రంతా అలాగే ఉంచి ఉదయం అల్పాహారానికి ముందు తీసుకోవాలి. ఇలా మూడు నెలల పాటు నిత్యం తప్పకుండా చేయడం వలన షుగర్ వ్యాధి నుంచి అలాగే అధిక కొలెస్ట్రాల సమస్య నుంచి బయటపడవచ్చు.. మామిడి పండ్లు తినడానికి చాలా రుచిగా ఉన్న అనారోగ్య సమస్యలు తగ్గించడానికి ప్రభావంతంగా ఉపయోగపడుతుంది. అయితే ఈ ఆకుల రసంలో ఇన్సులిన్ ఉత్పత్తిలో మార్పులు తీసుకొచ్చే చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. కావున ఈ విధంగా ఈ జ్యూస్ ను చేసుకొని తీసుకోవడం వలన మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ నుంచి బయటపడవచ్చు..