Mango Leaves : మామిడి ఆకులతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా…! తప్పక తెలుసుకోండి…!
ప్రధానాంశాలు:
Mango Leaves : మామిడి ఆకులతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా...! తప్పక తెలుసుకోండి...!
Mango Leaves : మామిడిపండు తలుచుకుంటే చాలు నోట్లో నీళ్లురుతాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరు మామిడిపండుని ఇష్టపడతారు. అయితే మామిడి పండే కాకుండా మామిడి ఆకులో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా..! అవేమిటో తెలుసుకుందాం… మామిడి ఆకులతో మధుమేహాన్ని నియంత్రణలో పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా రక్తపోటును తగ్గించడం ఉబ్బసాన్ని నియంతనించడం కడుపు ఉబ్బరాన్ని తగ్గించడం మరియు కడుపు ను ఆరోగ్యంగా ఉంచడంలో మామిడి ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయని అంటున్నారు.
![Mango Leaves మామిడి ఆకులతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా తప్పక తెలుసుకోండి](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/Mango-Leaves.jpg)
Mango Leaves : మామిడి ఆకులతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా…! తప్పక తెలుసుకోండి…!
ఒక అధ్యయనం ప్రకారం చూసుకున్నట్లయితే మామిడి ఆకులలో రక్తంలోని చక్కెర స్థాయినీ తగ్గించే లక్షణాలు కలిగి ఉన్నాయట. కనుక ఇది మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతుంది. ఫ్లేవనాయిడ్లు , మాంగిఫేరిన్ వంటి కొన్ని అంశాలు ఇందులో కనిపిస్తాయి. ఇవి శరీరంలో ఇన్సూరెన్స్ స్థాయినీ నియంత్రణలో ఉంచడంలో సహాయపడతాయి. అంతేకాకుండా గ్లూకోజ్ ను మేరుగుపరుస్తాయి. మామిడి ఆకులను సాంప్రదాయంగానే కాకుండా రక్తపోటు తగ్గించే వాటిలో కూడా ఉపయోగిస్తారు. ఇక క్వెర్సెటిన్, ఐసోక్వెర్సిట్రిన్, ఆస్ట్రాగాలిన్ వంటి అనేక క్రియాశీల పదార్థాలు ఉన్నాయి. అంతేకాకుండా అధిక బిపిని తగ్గించడంలో కూడా మామిడి ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే బరువు తగ్గడం మరియు కాలేయంలో పేరుకుపోయిన మురికిని తొలగించడం మామిడి ఆకు బెస్ట్ రెమెడీ అనే చెప్పుకోవచ్చు.
అదేవిధంగా మామిడి ఆకులతో తయారు చేసినటువంటి కషాయం తాగడం వలన విరోచనాలు అధికారం మరియు ఇతర కడుపు సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా ఇందులో ఉండేటువంటి టానిన్లు యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వలన ఇవి జీర్ణ వ్యవస్థను శాంతింపపరుస్తాయి. అయితే మామిడి ఆకులను తినడం సులభమైన మార్గం అయినప్పటికీ కొంతమందికి ఇష్టం ఉండదు. కాబట్టి వాటిని టీ లేదా కాషాయంగా చేసుకొని కూడా తాగవచ్చు. అయితే మార్కెట్లలో మామిడి ఆకు పొడి కూడా అందుబాటులో ఉంటుంది. దానిని గోరువెచ్చని నీటిలో మరిగించి తాగాలి. అయితే ఇలా తాగేముందు వైద్యుడు సలహాలను తప్పకుండా తీసుకోండి. యాంటీ ఇంప్లిమెంటరీ లక్షణాలు కలిగిన ఫినాలిక్ సమ్మేళనాలు మామిడి ఆకులు ఎక్కువగా ఉండడం వలన ఇది ఆర్థరైటిస్ వ్యాధుల వలన కలిగే వాపు లను తగ్గిస్తుంది. అదేవిధంగా బ్రో నైటిస్ ఆస్తమా జలుబు అంటే శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు మామిడి ఆకుల టీ ని తీసుకున్నట్లయితే ఉపశమనం పొందవచ్చు.