Banana Tea : రాత్రిళ్ళ నిద్ర పట్టడం లేదా..ఈ బనానా టీ తాగండి.. ఎలా చేయాలంటే..!
ప్రధానాంశాలు:
Banana Tea : రాత్రిళ్ళ నిద్ర పట్టడం లేదా..ఈ బనానా టీ తాగండి.. ఎలా చేయాలంటే..!
Banana Tea : కొంత మందికి నిద్రలేచిన వెంటనే టీ,కాఫీలను తాగే అలవాటు అనేది ఉంటుంది. రోజు మొత్తంలో రకరకాల కారణాలతో ఎక్కువ మొత్తంలో కాఫీలను తాగే వారు చాలా మంది ఉన్నారు. అయితే తక్కువ సార్లు టీ తాగటం మంచిది. అయితే ఎక్కువగా టీ లేక కాఫీలను తాగే అలవాటు ఉన్నట్లయితే మిల్క్ టీ కి బదులు అరటి పండుతో చేసిన టీ తాగటం బెస్ట్ అని చెబుతున్నారు నిపుణులు. అవును. ఇప్పటి వరకు గ్రీన్ టీ, బ్లాక్ టీ, చామంతి టీ, మందార టీ,మిర్చిటీ గురించి మీరు వినే ఉంటారు. ఇప్పుడు అరటిపండుతో తయారు చేసుకునే టీ గురించి తెలుసుకుందాం.ఈ టీ అనేది చాలా టేస్ట్ గా ఉండటమే కాక ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనిని తయారు చేయడం చాలా సింపుల్ గా కూడా ఉంటుంది. ఈరోజు బనానా తయారు చేయడం ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
Banana Tea : కావలసిన పదార్థాలు
1.అరటిపండు.
2.దాల్చిన చెక్క.
3.తేనె నీరు.
Banana Tea తయారీ విధానం
గ్యాస్ స్టవ్ మీద దళసరి గిన్నెను ఒకదాన్ని పెట్టి దానిలో నీరు పోసి మరిగించుకోవాలి. తరువాత తొక్క తీసిన అరటిపండు చివరలు కట్ చేసుకుని మరిగించిన నీటిలో వేయాలి. స్విమ్ లో పెట్టి అరటిపండు నీటిని మరిగించి దానిలో దాల్చిన చెక్క వేసి, అరటిపండు టీ లో కలుపుకోవాలి. ఈ బనానా టీ ని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. అయితే అరటిపండు తొక్క తీయకుండా కూడా టీ ని తయారు చేసుకోవచ్చు. ఈ టీలో పంచదార వేసుకోవలసిన అవసరం కూడా ఉండదు. ఎందుకు అంటే. అరటి పండు లోనే తీయదనం అనేది ఉంటుంది కావున.
బనానా టీ తాగటం వలన లాభాలు
1. బనానా టీ తాగటం వలన చక్కెరను తక్కువగా తీసుకుంటారు.
2. బరువు కూడా అదుపులో ఉంటుంది. బరువు పెరగరు.
3. షుగర్ వచ్చే అవకాశాలు కూడా తగ్గుముఖం పడతాయి.
4. బనానా టీ లో ట్రిప్టోఫాన్, సెరటోనిన్, డోపమైన్, అనే మజిల్ రిలాక్సట్స్ ఉంటాయి. ఇవి మానసిక ప్రశాంతతను కూడా ఇస్తాయి.
5. నిద్రలేమి సమస్యల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
6. అరటిపండు టీతో శరీరంలో ఉండే కొవ్వు అనేది కరుగుతుంది.
7. రోక నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
8. రక్తహీనతతో బాధపడే వారు కూడా ఈ బనానా టీ తాగటం వలన ఎర్రరక్త కణాలు వృద్ధి చెందుతాయి. అంతేకాక గుండె ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది…