Beauty Care : తక్షణ గ్లో పొందాలంటే… శనగపిండిలో ఏయే పదార్థాలు కలపాలో తెలుసా…!
Beauty Care : మన అమ్మమ్మల కాలం నాటి నుండి చర్మ సంరక్షణ కోసం శనగపిండిని ఎక్కువగా వాడుతున్నారు. అందుకే ఇది స్కిన్ గ్లో కోసం చాలా నమ్మకమైన పదార్థం అని చెప్పొచ్చు. అయితే ఈ శనగపిండి వలన చర్మానికి హాని కలిగే అవకాశాలు చాలా తక్కువ. ఈ శనగపిండి అనేది చర్మానికి సహజమైన క్లేన్సర్ లాంటిది. ఇది చర్మం పై పేర్కొన్నటువంటి మురికిని కూడా తొలగిస్తుంది. అలాగే ఎక్కువ నూనెను నియంత్రించడంలో కూడా హెల్ప్ చేస్తుంది. అయితే […]
ప్రధానాంశాలు:
Beauty Care : తక్షణ గ్లో పొందాలంటే... శనగపిండిలో ఏయే పదార్థాలు కలపాలో తెలుసా...!
Beauty Care : మన అమ్మమ్మల కాలం నాటి నుండి చర్మ సంరక్షణ కోసం శనగపిండిని ఎక్కువగా వాడుతున్నారు. అందుకే ఇది స్కిన్ గ్లో కోసం చాలా నమ్మకమైన పదార్థం అని చెప్పొచ్చు. అయితే ఈ శనగపిండి వలన చర్మానికి హాని కలిగే అవకాశాలు చాలా తక్కువ. ఈ శనగపిండి అనేది చర్మానికి సహజమైన క్లేన్సర్ లాంటిది. ఇది చర్మం పై పేర్కొన్నటువంటి మురికిని కూడా తొలగిస్తుంది. అలాగే ఎక్కువ నూనెను నియంత్రించడంలో కూడా హెల్ప్ చేస్తుంది. అయితే ఈ శనగపిండితో పేస్ట్ ను తయారు చేసుకొని అప్లై చేసుకుంటే ముఖంతో పాటుగా కాళ్లు, చేతులు, చర్మంయొక్క రంగును మెరుగుపరచటంలో ఎంతో ప్రభావవంతగా పని చేస్తుంది. ఈ శనగపిండిని తక్షణ గ్లో కోసం కూడా వాడతారు. అయితే ఈ శనగ పిండిలో కొన్ని పదార్థాలను కలిపి రాసుకుంటే మొటిమలు తగ్గడంతో పాటుగా ఛాయను మెరుగుపరచడమే కాక సహజమైన మెరుపును కూడా ఇస్తుంది. అయితే తక్షణం గ్లో పొందాలి అంటే శనగపిండిలో ఏ పదార్థాలు కలపాలో తెలుసుకుందాం…
తక్షణ గ్లో కోసం ఈ పదార్థాల తో కలిపి శనగపిండిని అప్లై చేయండి : తక్షణ గ్లో కోసం మీరు ఆలుగడ్డ రసం మరియు చిటికెడు పసుపు మరియు కలబంద జ్యూస్ ను శనగ పిండిలో కలిపి పేస్టులా చేయండి. తర్వాత ఈ పేస్ట్ ను మీ ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు అలా వదిలేయాలి. ఆ తర్వాత చేతులతో మసాజ్ చేస్తూ శుభ్రంగా క్లీన్ చేసుకోండి. దీనివలన చర్మం బంగారు రంగులో మెరుస్తుంది. నిజానికి ఈ శనగపిండి అనేది చర్మాన్ని క్లీన్ చేస్తుంది. అలాగే కలబంద చర్మాని హైడ్రేట్ చేస్తుంది. ఇకపోతే ఆలుగడ్డ రసం సహజమైన బ్లీచ్ గా పని చేస్తుంది. ఇక పసుపు గ్లోను పెంచడంలో సహాయపడుతుంది…
చర్మంలో మృత కణాలు అనేవి తొలగిపోయి గ్లో పెరగడం కోసం : మీ చర్మంపై డెడ్ స్కిన్ సెల్స్ పేర్కొన్నప్పుడు ముఖం అనేది డల్ గా కనిపించడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి దానిని ఎక్స్ ఫోలియేట్ చేయడం చాలా అవసరం. దీనికోసం రెండు చెంచాల శనగపిండిలో దానికి సమాన పరిమాణంలో పెరుగు లేక ఒక చెంచా తేనె మరియు ఒక టీ స్పూన్ కాఫీ కలపండి. తర్వాత ఈ మిశ్రమాన్ని తీసుకొని వృత్తాకార కదలికల్లో సున్నితంగా మసాజ్ చేయండి. అలాగే ఈ మిశ్రమంతో మీ ముఖాన్ని స్క్రబ్ చేయండి. అయితే ఈ కాఫీ అనేది చర్మం నుండి చనిపోయిన కణాలను తొలగించి చర్మం యొక్క రంధ్రాలను క్లీన్ చేస్తుంది. ఇకపోతే పెరుగు మరియు తేనే అనేది చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయి. ఈ విషయాలను కూడా ఖచ్చితంగా గుర్తించుకోండి. చర్మం అనేది చాలా పొడిగా ఉన్నట్లయితే, శనగపిండిని వాడేటప్పుడు పెరుగు లేక కలబందను కలుపుకోండి. అయితే ఇక్కడ చెప్పిన స్కిన్ కేర్ ప్యాక్ మరియు స్క్రబ్ ను వారానికి ఒక్కసారైనా వాడితే మంచి ఫలితాలు లభిస్తాయి…