Beauty Care : మీ ఆహారంలో ఈ ఐదు రకాల ఫ్రూట్స్ చేర్చుకుంటే చాలు… అందమైన చర్మం మీ సొంతం…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Beauty Care : మీ ఆహారంలో ఈ ఐదు రకాల ఫ్రూట్స్ చేర్చుకుంటే చాలు… అందమైన చర్మం మీ సొంతం…!!

 Authored By ramu | The Telugu News | Updated on :12 September 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Beauty Care : మీ ఆహారంలో ఈ ఐదు రకాల ఫ్రూట్స్ చేర్చుకుంటే చాలు... అందమైన చర్మం మీ సొంతం...!!

Beauty Care : ప్రస్తుత కాలంలో ఎంతోమంది ముఖం నిగారింపు మరియు స్పష్టమైన స్కిన్ టోన్ కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినా కూడా ఎటువంటి మార్పు కనిపించదు. అయితే సాధారణంగా కాలుష్యం మరియు ఒత్తిడి కారణం చేత ముఖంలో గ్లో అనేది తగ్గుతుంది. అయితే గ్లోయింగ్ స్కిన్ కోసం మార్కెట్లో ఎన్నో రకాల ప్రొడక్ట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ఎంతో మంది భయపడుతూ ఉంటారు. అయితే మీరు అందమైన మరియు స్పష్టమైన స్కిన్ టోన్ కలిగి ఉండాలి అంటే మీ ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి అని బ్యూటిషన్లు అంటున్నారు. అయితే కొన్ని ఫ్రూట్స్ మీ చర్మానికి ఎంతో లోతైన పోషణను అందించటంతో పాటుగా చర్మాన్ని మెరిసేలా చేయడంలో కూడా హెల్ప్ చేస్తుంది. దీనికోసం మీరు మీ ఆహారంలో ఈ ఐదు ఆహారాలను కచ్చితంగా చేర్చుకోవాలి. దీంతో మీకు మంచి ప్రయోజనం ఉంటుంది అని అంటున్నారు. అవేంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం…

స్ట్రోబెర్రీ : ఈ స్ట్రాబెర్రీలో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. దీనిలో ఉన్నటువంటి విటమిన్ సి వృద్ధాప్య ఛాయలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. అంతేకాక ఇది మొటిమలతో పోరాడటమే కాక స్కిన్ టోన్ ను కూడా ఎంతగానో మేరుగుపరుస్తుంది.

నారింజ : ఈ నారింజలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని కూడా ప్రేరేపిస్తుంది. అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా మరియు ప్రకాశవంతంగా కూడా ఉంచుతుంది. అయితే నారింజ లో ఉండే విటమిన్ సి హైడ్రాక్సిలేషన్ ప్రక్రియలో కూడా హెల్ప్ చేస్తుంది. ఇది ప్రోటీన్లను కూడా కొల్లాజెన్ గా మార్చేందుకు పని చేస్తుంది…

చేపలు : చేపలలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలోని యాంటీ ఇన్ఫ్లమెంటరీ హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో కూడా సహాయపడతాయి. ఇది ముఖంపై వాపు మరియు ఎరుపు రంగు ను కూడా తగ్గిస్తుంది. అలాగే అదనంగా ఒమెగా త్రి కొవ్వు ఆమ్లాలు చర్మాన్ని తేమగా ఉంచడంలో కూడా హెల్ప్ చేస్తాయి.

ద్రాక్ష : ద్రాక్షాలలో ప్రోయాంతో సైనిడిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇది సూర్యుడి నుండి వచ్చే హానికరమైన కిరణాల నుండి మన చర్మాని రక్షిస్తుంది. అలాగే ప్రయాణంతోసైనిడిన్స్ చర్మం లోని కొల్లాజెన్ ను కాపాడటంలో కూడా హెల్ప్ చేస్తుంది. ఇవి చర్మాన్ని ప్రకాశవంతంగా చేసేందుకు మరియు ముడతలతో పోరాడెందుకు కూడా హెల్ప్ చేస్తుంది.

Beauty Care మీ ఆహారంలో ఈ ఐదు రకాల ఫ్రూట్స్ చేర్చుకుంటే చాలు అందమైన చర్మం మీ సొంతం

Beauty Care : మీ ఆహారంలో ఈ ఐదు రకాల ఫ్రూట్స్ చేర్చుకుంటే చాలు… అందమైన చర్మం మీ సొంతం…!!

కివి : కివిలో కూడా విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన కొల్లాజెన్ ఉత్పత్తికి కూడా హెల్ప్ చేస్తుంది. అంతేకాక ఇది మన ప్రేగు ఆరోగ్యాన్ని మేరుగుపరచడంలో హెల్ప్ చేస్తుంది. ఇంకా ఇది నేరుగా మన చర్మంపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది