Beauty Tips : మీ ముఖం మరింత మెరిసిపోవాలనుకుంటే… ఈ వ్యాయామాలు ట్రై చేయండి… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Beauty Tips : మీ ముఖం మరింత మెరిసిపోవాలనుకుంటే… ఈ వ్యాయామాలు ట్రై చేయండి…

Beauty Tips : అందంగా, యవ్వనంగా ఉండాలి అని ఎవరు అనుకోరు. ప్రతి ఒక్కరూ కోరుకునేది అదే కదా.. అయితే చాలామంది అందంగా కనిపించాలి అని ఎన్నో రకాల క్రీమ్స్ ను పార్లర్కి వెళ్తూ మొహంపై ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చాలామంది 60 సంవత్సరాల వయసులో కూడా అందంగా కనిపించాలి అని కోరుకుంటారు. అయితే ఇలా అందంగా మెరిసిపోవాలి అంటే దానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. అంటే శరీరాన్ని చాలా స్ట్రాంగ్ గా ఉంచుకోవడానికి ఎన్నో […]

 Authored By aruna | The Telugu News | Updated on :27 August 2022,3:00 pm

Beauty Tips : అందంగా, యవ్వనంగా ఉండాలి అని ఎవరు అనుకోరు. ప్రతి ఒక్కరూ కోరుకునేది అదే కదా.. అయితే చాలామంది అందంగా కనిపించాలి అని ఎన్నో రకాల క్రీమ్స్ ను పార్లర్కి వెళ్తూ మొహంపై ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చాలామంది 60 సంవత్సరాల వయసులో కూడా అందంగా కనిపించాలి అని కోరుకుంటారు. అయితే ఇలా అందంగా మెరిసిపోవాలి అంటే దానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. అంటే శరీరాన్ని చాలా స్ట్రాంగ్ గా ఉంచుకోవడానికి ఎన్నో ఎక్సర్సైజులను చేస్తూ ఉంటాం. ఈ ఎక్సర్సైజులు చేస్తున్నప్పటికీ ముఖ వ్యాయామలపై మాత్రం ఎవరు ఆలోచన చేయరు. అందంగా కనపడాలి అనుకునే వారికి ఈ ముఖ వ్యాయామాలు… మన శరీరంలో ఉండేటువంటి రకరకాల అవయవాల మాదిరిగానే మెడ, ముఖం భాగాలలో ఉండేటువంటి కండరాలు పటిష్టంగా ఉంచుకోవడానికి ముఖ ఎక్సర్సైజులు కూడా ఉపయోగపడతాయి. మెరిసిపోయే అందం కోసం వృద్యాపంలో వచ్చే ముడతలను తగ్గించుకోవడానికి ఈ ఎక్సర్సైజులు చాలా సహాయపడతాయి. ఈ ఎక్సర్సైజులను ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం..

జూప్లెక్స్ : దవడలు ఎక్కువగా ఉంటే ముసలివార్ల కనిపిస్తూ ఉంటారు. ఈ జూప్లేక్స్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మీ రూపాన్ని కొంతవరకు మార్చుకోవచ్చు. ఈ వ్యాయామాన్ని చేసేటప్పుడు తలను ఇంటి పైకప్పును చూసేలా వీలైనంత పైకెత్తి వెనుకకు వంచాలి. అలాగే పెదవులను పై ముక్కు వరకు జరుపుతూ ఉండాలి. ఈ విధంగా చేసేటప్పుడు చెవులు దగ్గర దవడ కండరాలలో ఒత్తిడి కలుగుతుంది. 10 సెకండ్ల పాటు ఇలా చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. ఐబ్రో మసాజ్ : ఈ ఎక్ససైజ్ చేయడం వలన కనుబొమ్మలు రాలిపోకుండా ఉంటాయి. చూపుడి ,మధ్య వేలుని కనుగొమ్మలపైన నుదురు భాగంలో ఉంచి… కనుబొమ్మలను పైకి ఎత్తుతూ ఉండాలి. దీని సున్నితంగా వేళ్ళతో నుదుటిపై చర్మాన్ని మసాజ్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా చేసేటప్పుడు కళ్ళు తెరిచి ఉండాలి. 30 సెకండ్ల పాటు ఈ వ్యాయామం చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది.

Beauty Tips for face to glow more try these remedies

Beauty Tips for face to glow more try these remedies

చిక్ బోస్ లిఫ్ట్ : బుగ్గలు పెద్దగా ఉన్నవారు వారి బుగ్గల పరిమాణాన్ని తగ్గించుకోవడానికి ఈ ఎక్సర్సైజ్ చాలా బాగా సహాయపడుతుంది. రెండు చేతులను రెండు చెంపలపై ఉంచి చంప ఎముక ఉన్నచోట వేళ్లను పెట్టాలి. ఆ యొక్క భాగంలో కండరాలను పైకి అంటే కింది నుంచి కంటి వైపు లేపి అదిమి పట్టుకోవాలీ. ఈ టైంలోo ఆకారంలో నోరు తెరిచి ఉండాలి. ఈ విధంగా 5 సెకండ్ల పాటు ఈ వ్యాయామాన్ని రోజుకి 10 నుండి 15 సార్లు చేస్తే మీ ముఖం ఎంతో అందంగా మారుతుంది. పవర్ ఫిష్ ఫ్రెష్ : ఈ ఆకారంలో చెంపలు ఉబ్బినట్లుగా ఉంటాయి. దీనికి నోటిని పూర్తిగా గాలితో నింపి ఆపాలి. ఆ గాలిని బయటికి పోకుండా నోట్లోనే ఉంచాలి. ఆ గాలిని 10 సెకండ్ల పాటు ఎడమ చెంప వైపు ఉంచి మరోసారి కుడి చెంప వైపు పంపించాలి. ఈ విధంగా ఐదు నుంచి ఆరుసార్లు చేయాలి. ఇలా చేయడం వలన ముఖ కండరాలలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దీంతో చెంపలు మరింత బిగుతుగా మారుతాయి. మరింత మెరిసిపోతూ ఉంటారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది