Beauty Tips : జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉందా…? ఇటువంటి ఆహారాన్ని తీసుకోండి…?
ప్రధానాంశాలు:
Beauty Tips : జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉందా...? ఇటువంటి ఆహారాన్ని తీసుకోండి...?
Beauty Tips : ప్రస్తుత కాలంలో జుట్టు రాలే సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా జుట్టు రాలుతుందని బాధపడుతున్నారు. ఎన్నో ప్రొడక్ట్స్ ను వాడుతూ ఉంటారు. అయినా కానీ ఎ టువంటి ప్రయోజనం ఉండదు. అయితే జుట్టు సమస్య అనేది తినే ఆహారపు అలవాట్లు వల్ల కూడా సమస్యను పెరుగుతుంది. మంచి ప్రోటీన్స్ ఉన్న ఆహార పదార్థాలను తింటే జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు. కందగడ్డలు, క్యాల్షియం, ఎగ్స్, పాలకూర, క్యారెట్లు, వాల్ నట్స్, ఓట్స్, ఫ్లాక్స్ సీడ్స్ వంటి ఆహారాలు జుట్టుకు అవసరమైన పోషకాలు అందించడంతోపాటు,జుట్టును బలపరచడం ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఈ ఆహారపు అలవాట్లు జుట్లు రాలె సమస్యను తగ్గిస్తాయి. అలాగే జుట్టును ఒత్తుగా బలంగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. సహజ పద్ధతిలో జుట్టును ఆరోగ్యంగా ఉంచుటకు ఇటువంటి ఆహారాలు తీసుకోవడం చాలా ముఖ్యం.
ఇప్పటివరకు మనం చాలా మందిని చూస్తున్నాం. అందరిలో కూడా జుట్టు రాలే సమస్యలు పెరుగుతున్నాయి. తెల్ల జుట్టు, బట్టతల, పొడి జుట్టు, హెయిర్ ఫాల్ వంటి సమస్యలను చూస్తున్నాం. ఇప్పుడున్న బిజీ లైఫ్ లో కాలుష్యం, ఒత్తిడి, దుమ్ము ఈ కారణాల వల్ల జుట్టును ఎక్కువగా నష్టపరుస్తుంది. అయితే ఇందులో ఎక్కువగా జుట్టు రాలే సమస్య ఉంటుంది. అయితే ఈ జుట్టు రాని సమస్యను తగ్గించుకొనుటకు కొన్ని ఆహారాలను తింటే జుట్టు బలంగా ఆరోగ్యంగా ఉంటుంది. మనం జుట్టుని ఆరోగ్యం ఉంచుట కొనుక్కో ఎన్నో ఆయిల్ ని వాడుతూ ఉంటాం. జుట్టు పై భాగంలో మాత్రం మీ అభి పని చేస్తాయి. జుట్టు అంతర్గతంగా పని చేయాలి అంటే మనం తినే ఆహారపు అలవాటులో మంచి ఆహారాన్ని తినాలి. మనం తిన్న ఆహారం వల్ల మన జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టును ఆరోగ్యంగా ఉంచుటకు ఎటువంటి ఆహారాలను తీసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం…
Beauty Tips పాలకూర
జుట్టు పెరుగుదలకు అవసరమైన పొల్లేట్, విటమిన్ సి, విటమిన్ ఏ, ఐరన్ వంటి విటమిన్ లు పాలకూరలో పుష్కలంగా ఉన్నాయి. ఇవి జుట్టు రాలే సమస్యలను తగ్గించి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.
ఎగ్స్ : బయోటిన్, ఎగ్స్ ప్రోటీన్ మంచి మూలం. ఇవి జుట్టు బలాన్ని పెంచడంలో కీలకమైన పాత్రను పోషిస్తాయి.
Beauty Tips కంద గడ్డలు
కంద గడ్డలలో బీటా కెరటి అధికంగా ఉంటుంది. ఇది జుట్టుని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు, తేమగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.
ఓట్స్ : ఓట్స్ లో ఫైబర్,ఐరన్,జింక్, ఒమేగా 6,ఫ్యాటీ ఆసిడ్లు వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి జుట్టుకి అవసరమైన పోషకాలను అందిస్తాయి.
క్యారెట్లు : క్యారెట్లు కంటికి మాత్రమే కాదు జుట్టుకు కూడా అవసరమైన పోషకాలను సమృద్ధిగా అందిస్తాయి. క్యాల్షియం అధికంగా ఉన్న ఆహారాలు జుట్టుకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. వాల్ నట్స్, బ్లాక్ సీడ్స్ వంటి జింక్, 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఉన్న ఆహారాలు జుట్టును బలపరుస్తాయి.