Beauty Tips : ఓపెన్ ఫోర్స్ సమస్యను తగ్గించి స్కిన్ గ్లోను పెంచే పేస్ట్ ఏంటో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Beauty Tips : ఓపెన్ ఫోర్స్ సమస్యను తగ్గించి స్కిన్ గ్లోను పెంచే పేస్ట్ ఏంటో తెలుసా?

 Authored By pavan | The Telugu News | Updated on :23 March 2022,3:00 pm

Beauty Tips : శరీరంలో అతి పెద్ద అవయవం చర్మం. అలాగే అందరికీ కనిపించేది ఎక్కువగా కనిపించేది కూడా చర్మమే. అయితే చర్మం ఎంత ఆరోగ్యంగా, అందంగా ఉంటే అంత మంచిది. అయితే మనకు కనిపించకపోయినప్పటికీ చర్మంపై మిలియన్ల కొద్దీ రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాలన్నీ తెరిచే ఉంటాయి. అలాగే ప్రతీ రంధ్రంలో వెంట్రుకల పుట ఉంటుంది. ప్రతీ రంధ్రంలో సెబాసియన్ (ఆయిల్) గ్రంథులు కూడా ఉంటాయి. ఇవి సెబమ్ అనే నూనెను తయారు చేస్తాయి. అయితే మొహం, వీపు, ఛాతి, గజ్జల్లోని రంధ్రాల్లో సేబాషియన్ గ్రంథులు ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంటాయి. సెబమ్ యొక్క ఉత్పత్తి సమృద్ధిగా చేయడానికి ఈ గ్రంథులను ఉత్తేజ పరచడంలో హార్మోన్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయి.

అందుకే మీ ముఖం మీద ఉన్న రంధ్రాలు ప్రత్యేకంగా మీ ముక్కు, నుదురు, బుగ్గలపై ఉన్న రంధ్రాలు మీ శరీరంలోని ఇతర ప్రాంతాల కన్నా పెద్దవిగా కనిపిస్తాయి.అయితే జిడ్డు చర్మం కల్గిన వారైతే నూనె ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. సాధారణమైన చర్మం పొడిగా ఉంటుంది. సరైన శద్ధ లేనపుడు కాలుష్యం దుమ్ముధూళి వలన మీ చర్మం పెద్ద రంధ్రాలను కల్గి ఉన్నట్లు కనిపిస్తుంది. ఇవి మీ చర్మానికి అంద విహీనంగా కనిపిస్తాయి. ముఖ్యంగా ఆ చర్మ కణాలు ధూళి, బ్యాక్టీరియా, నూనె లేదా చనిపోయిన చర్మ కణాలతో నిండి ఉంటే అవి మెటిమలు, పిగ్మెంటేషన్ కి కారణమవుతాయి. ఓపెన్ రంధ్రాలు చర్మం మీద ఎక్కువగా కనిపించే విధానాన్ని ఇష్టపడని కొంత మందికి కాస్మెటిక్ సమస్యగా ఉంటాయి.

Beauty Tips in face pack to reduce open porce

Beauty Tips in face pack to reduce open porce

కౌమార దశలో మరియు మొటిమలకు గురయ్యే పెద్దల్లో బహిరంగ రంధ్రాలు మూసుకుపోయి బ్లాక్ హెడ్స్ లేదా వైట్ హెడ్స్ గా మారుతాయి. తక్కువ కల్లాజెన్ కల్గి ఉన్న వృద్ధాప్య చర్మం పెద్ద బహిరంగ రంధ్రాలను కల్గి ఉన్నట్లు కనిపిస్తుంది. ఇది వారిలో విపరీతమైన ఆందోళ న కల్గిస్తుంది. అయితే వీటన్నిటిని తగ్గించుకునేందుకు మన ఓ అద్భుతమైన పేస్ట్ తయారు చేసుకుందాం. ముందుగా కొంచెం మామిడి రసం తీసుకొని… అందులో మామిడి రసానికి సమానంగా తేనె, పెరుగు కలపాలి, దీన్ని ముఖానికి అప్లై చేసి ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు ఉంచి తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుంటే చర్మ రంధ్రాలు శుభ్రపడి ఓపెన్ పోర్స్ సమస్య తగ్గుతుంది. అంతే కాకుండా ముఖమంతా అందంగా తయారవుతుంది. అంతే కాకుండా కాంతి వంతగా అవుతుంది.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది