Beauty Tips : ఈ పేస్టుతో ముఖంపై మచ్చలు, మొటిమలు ఇట్టే మాయమవుతాయి.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Beauty Tips : ఈ పేస్టుతో ముఖంపై మచ్చలు, మొటిమలు ఇట్టే మాయమవుతాయి..

 Authored By pavan | The Telugu News | Updated on :16 April 2022,8:03 pm

Beauty Tips : అందమైన ముఖం కోసం అందరూ తాపత్రయ పడతారు. ముఖంపై ఏ చిన్న మచ్చ వచ్చినా సతమతం అవుతారు. మొటిమలు కనిపించినా అలాగే ఫీల్ అవుతారు. చాలా మంది ముఖం కాంతివంతంగా మారడం కోసం ఎన్నో చిట్కాలు పాటిస్తుంటారు. క్రీములు, పేస్టులు వాడతారు కానీ ఎన్ని వాడినా ముఖంపై మొటిమలు పోకపోవడంతో తీవ్రంగా సతమతం అవుతారి. ఇలాంటి చిట్కాలు పాటించిన వారిలో మొటిమలు ఎక్కువై మచ్చలు ఏర్పడతాయి. కొంతమందిలో మెలనిన్ ఎక్కువయ్యి ముఖంపై సీతాకోక చిలుక ఆకారంలో బుగ్గలపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి. ఇవి రోజు రోజుకు పెరుగుతూ ఉంటాయి. వీటికి చికిత్స కెమికల్ ఫీల్ లేజర్ చికిత్సలు చేస్తూ ఉంటారు. వీటి వలన ఫలితం ఉన్నా ఖరీదైనవి కావడం వలన అందరికీ అందుబాటులో ఉండవు.

వీటికి తక్కువ శ్రమతో ఇంట్లోనే చేసుకునే ఒక చికిత్స ఈ పిగ్మెంటేషన్, మొటిమలు, మచ్చలను నివారించి ముఖాన్ని కాంతివంతంగా తయారు చేస్తుంది. ఈ చికిత్సను రెండు భాగాలుగా విడదీయాలి. మొదటి దాంట్లో ఒక స్పూన్ పెరుగు తీసుకోవాలి. అలాగే పంచ దార పొడి చేసుకుని విడిగా పెట్టుకోవాలి. దానితో అరచెక్క నిమ్మకాయ కూడా తీసుకావాలి. మొదట పెరుగును ముఖానికి ప్యాక్లా అప్లై చేయాలి. తర్వాత ఇరవై నిమిషాలు గడిచాక అరచెక్క నిమ్మకాయతో పంచదార పొడి తీసి ముఖాన్ని స్క్రబ్ చేయాలి. ఇలా ముఖం మొత్తం చేసిన తర్వాత మామూలు నీటితో ముఖాన్ని కడగాలి.తర్వాత ఒక స్పూన్ చందనం దానిలో ప్యాక్లా చేయడానికి సరిపడా బంగాళదుంప రసం వేసుకోవాలి.

Beauty Tips magical remedy for pigmentation

Beauty Tips magical remedy for pigmentation

దానిలో చిటికెడు పసుపు కూడా వేసి ముఖానికి అప్లై చేయాలి. ఆరిన తర్వాత నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. ఇవి మొటిమలు, పిగ్మెంటేషన్ తొలగించడంతో పాటు మొటిమలు రాకుండా అడ్డుకుంటాయి. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ కెమికల్ ఫీల్ చేసే పనిని సమర్థవంతంగా చేస్తుంది.ఇది చర్మాన్ని బిగుతుగా చేయడంలోనూ, యవ్వనాన్ని తిరిగి అందించడంలోనూ అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. దీనిలో వేసిన బంగాళదుంప సహజ బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఇది ముఖాన్ని శాతాన్ని తగ్గించి కాంతివంతంగా చేయడంలో సహాయపడుతుంది. పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలు, మచ్చలు రాకుండా అడ్డుకుంటాయి. ముఖంపై ఏర్పడే ఇన్ఫెక్షన్లను తొలగిస్తాయి. ఇలా టిప్ ఉపయోగించి సహజంగానే మంగు, పిగ్మెంటేషన్, మొటిమలను తగ్గించుకోవచ్చు.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది