Beauty Tips : 5 రూపాయలతో మీ స్కిన్ హెయిర్ పర్మినెంట్గా రిమూవ్ అవుతుంది. స్కిన్ తెల్లగా మారుతుంది. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Beauty Tips : 5 రూపాయలతో మీ స్కిన్ హెయిర్ పర్మినెంట్గా రిమూవ్ అవుతుంది. స్కిన్ తెల్లగా మారుతుంది.

Beauty Tips : ఎవరైనా అందంగా ఉండాలి. చర్మం ఎప్పుడు మెరిసిపోవాలి అనుకుంటూ ఉంటారు. అయితే చాలామందిలో వాళ్ళ స్కిన్ బ్లాక్ గా డార్క్ గా ఉంటుంది. అలాంటివారు వారి చర్మం తెల్లగా అవ్వడం కోసం ఎన్నో రకాల కెమికల్స్ ఉన్న క్రీమ్స్ ను వాడుతూ ఉంటారు. కానీ ఆ క్రీమ్స్ వల్ల చాలామందికి పెద్దగా ఉపయోగం ఉండదు. అయితే అలాంటి వారికి ఇంట్లో నాచురల్ గా దొరికే వాటితో చర్మం తెల్లగా మారుతుంది. అదేవిధంగా చాలామందిలో […]

 Authored By aruna | The Telugu News | Updated on :29 August 2022,5:00 pm

Beauty Tips : ఎవరైనా అందంగా ఉండాలి. చర్మం ఎప్పుడు మెరిసిపోవాలి అనుకుంటూ ఉంటారు. అయితే చాలామందిలో వాళ్ళ స్కిన్ బ్లాక్ గా డార్క్ గా ఉంటుంది. అలాంటివారు వారి చర్మం తెల్లగా అవ్వడం కోసం ఎన్నో రకాల కెమికల్స్ ఉన్న క్రీమ్స్ ను వాడుతూ ఉంటారు. కానీ ఆ క్రీమ్స్ వల్ల చాలామందికి పెద్దగా ఉపయోగం ఉండదు. అయితే అలాంటి వారికి ఇంట్లో నాచురల్ గా దొరికే వాటితో చర్మం తెల్లగా మారుతుంది. అదేవిధంగా చాలామందిలో ముఖం మీద జుట్టు ఉంటుంది. మనం తయారు చేసే మిశ్రమంలో హెయిర్ రిమూవ్ కూడా చేసుకోవడం ఈజీగా అవుతుంది. అది ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. దీంతో హెయిర్ పర్మినెంట్గా రిమూవ్ అవుతుంది. స్కిన్ తెల్లగా మారుతుంది. అదే ఆయుర్వేదం షాప్ లో దొరికే పట్టిక బెల్లం. ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది దీని ధర చాలా తక్కువ.

బ్యూటీ పార్లర్ కి వెళ్లకుండా ముఖం పైన ఉండే అన్ వాంటెడ్ హెయిర్ ను సింపుల్ గా రిమూవ్ చేసుకోవచ్చు. బ్యూటీ పార్లర్ కి వెళ్లి ఎంతో ఖర్చు చేసి ప్యాకులను వేయించుకుంటూ ఉంటారు. అలాకాకుండా ఇంట్లోనే అయిదు రూపాయల ఖర్చుతోని పర్మినెంట్గా ఆన్ వాంటెడ్ హెయిర్ ను రిమూవ్ చేసుకోవచ్చు. ముందుగా ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.. ఒక బౌల్ తీసుకొని ఒక స్పూన్ గంధపు పొడి లేదా ముల్తాన్ మట్టిని తీసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ శెనగపిండి కూడా వేసుకోవాలి. తర్వాత దీనిలో ఒక స్పూన్ పెరుగు ని కూడా వేసి కలుపుకోవాలి. పెరుగు వద్దు లేదు అనుకునేవాళ్లు పచ్చి పాలని కూడా కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకొని ముఖంపై అప్లై చేసుకొని బాగా మర్దన చేసుకోవాలి.

Beauty Tips skin hair will be permanently removed With 5 Rs Only

Beauty Tips skin hair will be permanently removed With 5 Rs Only

తర్వాత ఈ ప్యాక్ ఆరేంతవరకు ఉంచుకొని తర్వాత చల్లని నీటితో క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా పది రోజులకి ఒకసారి వేసుకోవడం వలన ముఖంపై ఉండే అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ అవ్వడమే కాకుండా.. మీ ముఖం వైట్ గా మారుతుంది. అదేవిధంగా పటిక బెల్లం నుంచి కొంచెం పౌడర్ ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక చెంచా పట్టిక బెల్లం పొడిని తీసుకుని, ఒక చిటికెడు పసుపు దానిలో వేసుకోవాలి. దీనికోసం కస్తూరి పసుపు పైన వాడుకోవచ్చు. లేదా మనం ఇంట్లో వాడుకునే పసుపు అయినా కూడా ఉపయోగించవచ్చు. తర్వాత దీనిలో కొంచెం రోజు వాటర్ కలుపుకొని, తర్వాత ఒక స్పూన్ పాలను కూడా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని దీనిని ముఖం పైన అలాగే అన్వాంటెడ్ హెయిర్ ఉన్న ప్రదేశంలో అప్లై చేసుకుని ఐదు నిమిషాల పాటు ఉంచుకోవాలి. తరువాత చల్లని నీళ్లతో ఫేస్ వాష్ సబ్బు వాడకుండా క్లీన్ చేసుకోవాలి. అంతే ఇలా వారానికి ఒక్కసారి చేస్తూ ఉంటే మీ ఫేస్ తెల్లగా మెరిసిపోతూ ఉంటుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది