Health Benefits : రెండు ఖర్జూరాలను ఇలా తీసుకున్నారంటే… ఎంత లావుగా ఉన్న సన్నగా అయిపోతారు…
Health Benefits : ప్రస్తుత కాలంలో చాలామంది అధిక బరువు సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి కారణం జీవన విధానంలో వచ్చిన మార్పులు, శారీరక శ్రమ లేకపోవడం, చేసే పనిలో ఒత్తిడి, మోనోపాజ్, బేకరీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ వంటి వాటిని ఎక్కువగా తీసుకోవడం ఇలా ఎన్నో కారణాల వలన బరువు పెరుగుతున్నారు. అలాగే బరువు పెరగడమే కాకుండా పొట్ట కూడా బానల తయారవుతుంది. ఈ పొట్టను తగ్గించుకోవడానికి మరియు శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును […]
Health Benefits : ప్రస్తుత కాలంలో చాలామంది అధిక బరువు సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి కారణం జీవన విధానంలో వచ్చిన మార్పులు, శారీరక శ్రమ లేకపోవడం, చేసే పనిలో ఒత్తిడి, మోనోపాజ్, బేకరీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ వంటి వాటిని ఎక్కువగా తీసుకోవడం ఇలా ఎన్నో కారణాల వలన బరువు పెరుగుతున్నారు. అలాగే బరువు పెరగడమే కాకుండా పొట్ట కూడా బానల తయారవుతుంది. ఈ పొట్టను తగ్గించుకోవడానికి మరియు శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించుకోవడానికి ఖర్జూరాలు ఎంతగానో సహాయపడతాయి. ప్రతిరోజు రెండు ఖర్జూరాలను ఈ విధంగా తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
ఖర్జూరాలలో పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, కాల్షియం, ఐరన్, మాంగనీస్ లాంటి మినరల్స్ ఉంటాయి. ఖర్జూరాలలో ప్రక్టోస్ ఉంటుంది. అందుకే అవి తీయగా ఉంటాయి. నీరసం, అలసట చెందిన వాళ్లు కొన్ని ఖర్జూర పండ్లను తింటే వెంటనే శక్తి వస్తుంది. అయితే బరువు తగ్గాలనుకునేవారు ఖర్జూర పండ్లతో ఇలా చేశారంటే మంచి ఫలితం ఉంటుంది. ఒక గిన్నె తీసుకొని అందులో ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడి, ఒక స్పూన్ సొంటి పొడి, రెండు స్పూన్ల నిమ్మరసం, ఒక స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రెండు ఖర్జూరాలను తీసుకొని నిలువుగా కట్ చేసి వాటిలో ఉండే గింజలను తీసివేయాలి.
మనం ముందుగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని అందులో కూర్చాలి. ఈ స్టఫ్డ్ ఖర్జూరాలని ప్రతిరోజు ఉదయం తీసుకుంటే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు క్రమంగా కరిగి పోతుంది. స్టఫ్డ్ ఖర్జూరాలను తీసుకోవడం వలన బాడీలో కొవ్వు కరగడమే కాకుండా కంటి చూపు పెరుగుతుంది. అంతేకాకుండా రక్తహీనత సమస్య తగ్గుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా మన శరీరాన్ని కాపాడుతుంది. చర్మం యవ్వనంగా మెరుస్తూ ఉంటుంది. స్టఫ్డ్ ఖర్జూరాలను ఎక్కువగా తయారు చేసుకొని ఫ్రిజ్లో పెడితే దాదాపుగా నాలుగు రోజులు పాటు నిల్వ ఉంటాయి. ఈ రెమిడిలో ఉపయోగించిన అన్ని పదార్థాలు శరీరంలో కొవ్వును కరిగించడానికి బాగా పనిచేస్తాయి.