Beauty Tips : అవాంఛిత రోమాలను తొలగించే పవర్ ఫుల్ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసా?
Beauty Tips : మనలో చాలా మందికి అవాంఛిత రోమాలు వస్తుంటాయి. పెదవి పై భాగంలో, గడ్డం మీద అలాగే చెవుల దగ్గర ఎక్కువగా వస్తుంటాయి. వీటిని బ్యూటీ పార్లర్లు, చర్మ సంబంధిత ఆస్పత్రులకు వెళ్లి తీయించుకుంటూ ఉంటారు. మరికొందరు అయితే ఇంట్లోనే షేవింగ్ చేస్తూ తీసేస్తుంటారు. కానీ ఇలా చేయడం వల్ల ఆ వెంట్రుకలు మరింత పెరుగుతాయి. అంతేకాకుండా ఎంతో సున్నతమైన మొహం మీద షేవ్ చేయడం వల్ల మొహం కూడా పాడవుతూ ఉంటుంది. అయితే ఇలాంటి అవాంఛీత రోమాలను తొలగించాలనుకుంటే వేలకు వేలు డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.. అలాగని బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగనవసరం లేదు. మీ ఇంట్లో ఉన్న పదార్థలతోనే మీరు ఇబ్బంది పడుతున్న అవాంఛిత రోమాలను తొలగించుకోండి.
అయితే ఇలా ఎలా చేయొచ్చో మనం ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా పటిక బెల్లాన్ని తీసుకొని దాన్ని పౌడర్ గా చేసుకోవాలి. ఒక స్పూన్ పటిక బెల్లాన్ని తీసుకొని దానిలో రెండు చెంచాల రోజ్ వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. అంతకు ముందు ముఖాన్ని క్లీన్ గా శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఏదైనా మంచి కాటన్ తో ఈ మిశ్రమాన్ని ముఖం మొత్తం అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవాలి. దీనికోసం ఒక బౌల్ తీసుకొని రెండు చెంచాల శనగపిండి వేసుకోవాలి. దీనిలో ఒక స్పూన్ పటిక బెల్లం పొడి కూడా వేసుకోవాలి. పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. మూడు చుక్కల కొబ్బరి నూనె వేసుకోవాలి.
కొబ్బరి నూనె వద్దనుకున్న వాళ్లు బాదం నూనె కూడా వేసుకోవచ్చు. నాలుగు లేదా ఐదు చుక్కల నిమ్మరసం వేసుకోవాలి. దీనిలో రెండు చెంచాల పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పటిక బెల్లం, రోజ్ వాటర్ కలిపి అప్లై చేసిన ప్యాక్ మీదనే ఈ ప్యాక్ అప్లై చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత సర్కులర్ మోషన్ లో స్క్రబ్ చేస్తూ ప్యాక్ రిమూవ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ప్ పెట్టకూడదు. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉండే అవాంఛిత రోమాలు తొలగిపోతాయి. పసుపు, పటిక బెల్లం, నిమ్మరసం, అవాంఛిత రోమాలు తొలగించడంలో బాగా పని చేస్తుంది.