Best Food : వీటిని రాత్రి డిన్నర్ లో తిన్నారంటే… ఉదయం లేచేసరికి పొట్ట మొత్తం క్లీన్.. ఏం తినాలో తెలుసా.?
ప్రధానాంశాలు:
Best Food : వీటిని రాత్రి డిన్నర్ లో తిన్నారంటే... ఉదయం లేచేసరికి పొట్ట మొత్తం క్లీన్.. ఏం తినాలో తెలుసా.?
5 ఆహారాలని తప్పకుండా తీసుకోవాలి. ఈ చిన్న చిన్న డైట్ టిప్స్ ఫాలో అయితే మల విసర్జనకు కు ఇబ్బంది కలగదు.
Best Food : ప్రస్తుతం చాలామంది మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య రావడానికి కారణాలు తప్పుడు ఆహార నియమాలు.. ఈ అలవాట్లే మలబద్ధకానికి దారి తీస్తూ ఉంటాయి. ఉదయం పూట పొట్ట శుభ్రంగా క్లీన్ కాకపోతే రోజంతా గందరగోళంగా అనిపిస్తూ ఉంటుంది. మలవిసర్జన చేసే సమయంలో ఎక్కువ ఒత్తిడి చేయవలసి వస్తుంది.. ఎక్కువ సమయం బాత్ రూమ్ లోనే గడపవలసి వస్తుంది. ఈ సమస్య ఉన్నవారికి కొన్ని రకాల వ్యాధులతో కూడా బాధపడవలసి వస్తుంది. ఈ పరిస్థి నుంచి ఉపశమనం కలగాలంటే డైట్ చక్కటి మార్గం ఆహారంలో ఎక్కువ ఫైబర్ తీసుకుంటే మలబద్ధకం సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు.. కొవ్వు పదార్థాలకు దూరంగా ఉంటే మంచిది. మలబద్దకాన్ని నివారించడానికి పుష్కలంగా నీటిని తాగాలి.
అలాగే ఈ క్రింది 5 ఆహారాలని తప్పకుండా తీసుకోవాలి. ఈ చిన్న చిన్న డైట్ టిప్స్ ఫాలో అయితే మల విసర్జనకు కు ఇబ్బంది కలగదు.
అయితే కూరగాయల విషయంలో రాజీ పడకూడదు.. ఆకుకూరలు, బంగాళదుంప, గుమ్మడికాయ, పాలకూర, కరివేపాకు మొదలుకొని అన్ని రకాల కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. కూరగాయలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగించడానికి సహాయపడుతుంది.. రోజు వారి ఆహారంలో ఒక గిన్నె పప్పులను చేర్చుకోవాలి. పప్పులు ఆహా ఆహారంలో తినడం వలన మలబద్ధక సమస్య ఉండదు. వన్ బై టు కప్పు వండిన పప్పులో 7.8 ఫైబర్ ఉంటుంది. పప్పులో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడతాయి. అలాగే ఆవిస గింజల వల్ల వచ్చే ఎన్నో ప్రయోజనాలు మలబద్ధకాన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఒక టీ స్పూన్ అవిస గింజలు 2.7 గ్రాముల ఫైబర్ ఉంటుంది.
అవిస గింజలు నానబెట్టిన నీటిని తాగడం వలన మలవిసర్జన ఈజీగా జరుగుతుంది. హోమోరైడ్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అవిస గింజల మాదిరిగానే చియా గింజల్లో కూడా ఫైబర్తో అధికంగా ఉంటుంది. ఒక స్పూన్ చియా గింజల్లో 9.75 గ్రాములు ఫైబర్ ఉంటుంది. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీటిలో నానబెట్టిన చీయ గింజలన నీరు మరునాడు తాగితే కడుపు శుభ్రంగా క్లీన్ అవుతుంది. అలాగే ఆపిల్. ఆపిల్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఆపిల్ పీల్స్ కూడా ఫైబర్తో నిండి ఉంటుంది. ఆపిల్ మలాన్ని మృదువుగా చేస్తుంది. దీంతో మల విసర్జనకు ఎటువంటి ఒత్తిడి కలగదు. పొట్ట శుభ్రంగా క్లీన్ అవుతుంది. పిల్లలకు మలబద్దక సమస్య ఉంటే ఆపిల్ తినిపించాలి. ఈ విధంగా ఈ ఆహారపు అలవాట్లను అలవర్చుకుంటే మలబద్ధక సమస్య నుంచి బయటపడవచ్చు..