Diabetes : డయాబెటిస్ కు ఇలా చెక్ పెట్టండి.. ఈ ఫుడ్ తీసుకుంటే ఇక రమ్మన్నా రాదు
Diabetes : ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న సమస్య డయాబెటీస్. దీనికి లైఫ్ స్టైల్, అధిక ఒత్తిడి, ఆహార నియమాలు ప్రధాన కారణాలు. ఇన్సులిన్ తక్కువగా విడుదలవడం.. తద్వారా రక్తంలోని చక్కెర స్థాయిలు అలాగే పెరిగిపోతూ ఉండడం ఈ సమస్యకు ముఖ్య కారణం. షుగర్ లెవల్స్ ఒక్కసారి పెరగడం ప్రారంభమైతే తప్పనిసరిగా లైఫ్ స్టైల్, ఆహార నియమాలు మార్చుకోవాల్సిందే. అయితే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తగ్గించుకుని పోషకాలు ఉండే ఫుడ్ తీసుకుంటే షుగర్ ని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు.అయితే తరచూ మూత్ర విసర్జన, బరువు తగ్గడం, కంటి చూపు లోపాలు, అలసట, ఆకలి, దాహం పెరగడం వంటివి డయాబెటిస్కి సూచనలుగా చెప్పవచ్చు.
మహిళల్లో అయితే వజైనల్ డ్రైనెస్, ఈస్ట్ ఇన్ఫెక్షన్లు, మూత్రనాళ సంబంధిత సమస్యలు వంటివి కూడా కనిపిస్తాయి. ప్రెగ్నెన్నీలో ఎక్కువగా కనిపించే జస్టేషనల్ డయాబెటిస్ వల్ల బిడ్డకు పోషకాలు అందకుండా పోయే ప్రమాదం ఉంటుంది.అలాగే డయాబెటిస్ వచ్చిన వారిలో గుండె పోటు, కిడ్నీ సమస్యలు, డిప్రెషన్, చర్మ సమస్యలు వంటివి వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకే వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అందుకే జీవన శైలి మార్చుకుంటే తప్ప డయాబెటిస్ కంట్రోల్లోకి తెచ్చుకోవడం కష్టం. ఇందుకోసం ఆరోగ్యకరకమైన కార్బొహైడ్రేట్లు తక్కువగా ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది.
Diabetes : లైఫ్ స్టైల్ మార్చుకోవాలి..
వీటితో పాటు గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహార పదార్థాలు, ముడి ధాన్యాలు తీసుకుంటే మంచిది.అలాగే డయాబెటిక్ రోగులు కివీ, ఆపిల్, పియర్, పీచు, బెర్రీలు, బ్లూ బెర్రీలు, నారింజ, బొప్పాయి మొదలైన వాటిని నిర్ణీత పరిమాణంలో తీసుకోవచ్చు. ఈ పండ్లలో ఫైబర్, విటమిన్ సీతో సహా అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవే కాకుండా జామున్ పండు చాలా మేలు చేస్తుంది.కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే రైస్, ఇడ్ల, దోస వంటి టిఫిన్స్ తీసుకోవడం కంటే ఫ్రూట్స్, కూరగాయలు, ఎండు గింజలను ఎక్కువగా తీసుకుంటే షుగర్ లెవల్స్ కంట్రోల్ చేసుకోవచ్చు.