Biryani leaf : బిర్యానీ ఆకులతో కూడా షుగర్ కు చెక్ పెట్టొచ్చు… ఎలాగో తెలుసుకోండి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Biryani leaf : బిర్యానీ ఆకులతో కూడా షుగర్ కు చెక్ పెట్టొచ్చు… ఎలాగో తెలుసుకోండి…!

Biryani leaf : ప్రస్తుత కాలంలో షుగర్ తో బాధపడుతున్న వారి సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. దీనికి కారణం అనారోగ్య కరమైన ఆహారపు అలవాట్లు మరియు జీవనశైలి. ఈ కారణాల వలన దీర్ఘకాలిక సమస్యలు మనల్ని వెంటాడుతున్నాయి. దీంతో వయసుతో సంబంధం లేకుండా అందరూ డయాబెటిస్ సమస్య భారినా పడుతున్నారు. అయితే ఈ షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయాలి అంటే ప్రతి నిత్యం ఖచ్చితంగా టాబ్లెట్ లను తీసుకోవాలి. కానీ ఈ మందులు వాడకుండా మీరు తీసుకునేటటువంటి […]

 Authored By ramu | The Telugu News | Updated on :16 August 2024,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Biryani leaf : బిర్యానీ ఆకులతో కూడా షుగర్ కు చెక్ పెట్టొచ్చు... ఎలాగో తెలుసుకోండి...!

Biryani leaf : ప్రస్తుత కాలంలో షుగర్ తో బాధపడుతున్న వారి సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. దీనికి కారణం అనారోగ్య కరమైన ఆహారపు అలవాట్లు మరియు జీవనశైలి. ఈ కారణాల వలన దీర్ఘకాలిక సమస్యలు మనల్ని వెంటాడుతున్నాయి. దీంతో వయసుతో సంబంధం లేకుండా అందరూ డయాబెటిస్ సమస్య భారినా పడుతున్నారు. అయితే ఈ షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయాలి అంటే ప్రతి నిత్యం ఖచ్చితంగా టాబ్లెట్ లను తీసుకోవాలి. కానీ ఈ మందులు వాడకుండా మీరు తీసుకునేటటువంటి ఆహారంతోనే షుగర్ ను కంట్రోల్ చేయవచ్చు. ఈ డయాబెటిస్ ను కంట్రోల్ చేయడంలో బిర్యానీ ఆకు ఎంతో బాగా పనిచేస్తుంది అని ప్రస్తుతం జరిపిన పలు రకాల పరిశోధనలో తేలింది. అయితే ఈ ఆకులను ఎలా తీసుకోవాలి. ఈ బిర్యానీ ఆకులతో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం…

Biryani leaf షుగర్ ను తగ్గించడానికి ఇలా తీసుకోండి

ముందుగా బిర్యానీ ఆకులను ఒక పది తీసుకోవాలి. వాటిలో 3 గ్లాస్ లా వాటర్ పోసి 10 నిమిషాల పాటు మీడియం మంటపై మరిగించాలి. దాని తర్వాత ఆ నీటిని వడకట్టుకొని రోజులో మూడు సార్లు తీసుకోవాలి. కావాలంటే దీనిలో కొద్దిగా తేనెను కూడా వేసుకొని తాగవచ్చు. కానీ దీనిని డైరెక్ట్ గా తాగితేనే రక్తంలో షుగర్ లెవెల్స్ అనేవి తగ్గు ముఖం పడతాయి. మీరు భోజనం చేసే ఒక గంట ముందు ఈ నీటిని తీసుకోవాలి. ఇలా ఈ నీటిని మూడు రోజులపాటు తీసుకోవాలి. తర్వాత ఒక రెండు వారాలు గ్యాప్ ఇచ్చి మళ్లీ మూడు రోజులు ఈ బిర్యానీ ఆకుల నీటిని తాగాలి. మీరు ఇలా చేయటం వలన షుగర్ అనేది అదుపులో ఉంటుంది…

ఆకుల పొడి : దీనిని కేవలం కషాయం రూపంలో మాత్రమే కాకుండా బిర్యానీ ఆకుల పొడిని కూడా వాడవచ్చు. మీరు ఈ పొడిని ఉదయం సాయంత్రం ఆహారం తీసుకునే ఒక గంట ముందు తీసుకోవాలి. ఇలా చేయటం వలన మధుమేహ వ్యాధి అనేది అదుపులో ఉంటుంది.

Biryani leaf బిర్యానీ ఆకులతో కూడా షుగర్ కు చెక్ పెట్టొచ్చు ఎలాగో తెలుసుకోండి

Biryani leaf : బిర్యానీ ఆకులతో కూడా షుగర్ కు చెక్ పెట్టొచ్చు… ఎలాగో తెలుసుకోండి…!

ఇతర ప్రయోజనాలు : ఈ బిర్యానీ ఆకుల రసాన్ని తీసుకోవటం వలన ఇతర రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ నీటిని తీసుకోవటం వలన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అనేది కరుగుతుంది. దీనివలన గుండె సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడగలిగే లక్షణాలు కూడా ఈ బిర్యానీ ఆకుల్లో ఉన్నాయి అని పరిశోధకులు అంటున్నారు. ఈ బిర్యానీ ఆకుల నీటిని తీసుకోవటం వలన ఒత్తిడి మరియు ఆందోళన కూడా దూరం అవుతుంది. అలాగే కిడ్నీలో ఉన్నటువంటి రాళ్లు కూడా కరుగుతాయి. అంతేకాక కాళ్లు మరియు కీళ్లు, శరీర నొప్పులు మరియు వాపులను కూడా తగ్గిస్తుంది…

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది