Health Benefits : స్మోకింగ్ అలవాటు ఉన్నవారికి… ఈ నల్ల మిరియాలతో చెక్ పెట్టవచ్చు…
Health Benefits : నల్ల మిరియాలు ఈ మిర్యాలలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ప్రాచీన కాలంలో ఈ మిరియాలను కారం బదులుగా వాడుకునేవారు.. ప్రస్తుతం మీ మిరియాలు వాడడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ నల్ల మిరియాల్లో యాంటీ ఇంప్లమెంటరీ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి అల్జీమర్స్ ,మధుమేహం ,కీళ్ల నొప్పులాంటి వ్యాధులను నివారించడంలో అద్భుతంగా పనిచేస్తాయి.
అదేవిధంగా వెయిట్ లాస్ అవ్వడానికి, దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కలగడానికి అదేవిధంగా నల్ల మిరియాలు ఎంతో అద్భుతంగా పనిచేస్తాయి. ఈ మిరియాలు ఆయుర్వేదంలో ఎన్నో సంవత్సరాలుగా వాడుతున్నారు. వీటిలో ఉన్న ఔషధ గుణాలు పెద్దలకి ,పిల్లలకి చాలా బాగా ఉపయోగపడతాయి.శరీరంలో కొలెస్ట్రాల్ అలాగే రక్తపోటు, మధుమేహం కంట్రోల్లో ఉండేలా చేస్తాయి. ప్రధానంగా ఈ నల్ల మిరియాలు స్మోకింగ్ అలవాటునుండి దూరంగా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.
ఇది క్యాన్సర్ నీ తగ్గించి గుణాలు కూడా ఉన్నాయి.ఈ మిరియాలు పేగులలో మంటను కీళ్ల నొప్పులను చాలా బాగా తగ్గిస్తాయి. అలాగే శరీరంలో ఉన్న చెడు మలినాలను కూడా బయటికి పంపిస్తాయి. జీర్ణవ్యవస్థ మెరుగుపరచడానికి కూడా ఉపయోగపడతాయి.