Breast Feeding : తల్లిపాలపై అవగాహన కల్పిస్తున్న కేంద్ర ప్రభుత్వం…!
ప్రధానాంశాలు:
Breast Feeding : తల్లిపాలపై అవగాహన కల్పిస్తున్న కేంద్ర ప్రభుత్వం...!
Breast Feeding : ఈ సృష్టిలో అమ్మతనం అనేది ప్రతి మహిళ కోరుకునే ఒక వరం. అయితే ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుకూలంగా కొన్ని అలవాట్లు కూడా మారుతున్నాయి ముఖ్యంగా చెప్పాలంటే. బిడ్డను కన్న తల్లి బిడ్డకు పాలు ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. అయితే బిడ్డకు పాలు ఇవ్వడం వలన శారీరక మార్పులతో పెద్దవాళ్లలా కనిపిస్తాం అనే అనుమానం తో ఎంతోమంది బిడ్డలకు పాలు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. అయితే బిడ్డ పుట్టిన ఆరు గంటల లోపే తల్లి యొక్క ముర్రి పాలు బిడ్డకు ఇస్తే చాలా మంచిది అని వైద్యులు అవగాహన కల్పిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆడవాళ్ళల్లో రోమ్ము క్యాన్సర్ బాధితులు ఎక్కువగా ఉన్నారు. అయితే ముఖ్యంగా బిడ్డలకు పాలు ఇవ్వని తల్లులు ఈ సమస్యతో బాధపడుతున్నారు అని కొంతమంది అంటున్నారు. ఈ తరుణంలో తల్లిపాలు ఇవ్వడం వలన రొమ్ము క్యాన్సర్ నుండి రక్షిస్తుందా. ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం…
కేంద్ర ప్రభుత్వం తల్లిపాలపై అవగాహన కల్పించేందుకు ఆగస్టు మొదటి వారంలో తల్లిపాల వారోత్సవాలను ఏర్పాటు చేస్తున్నారు. అయితే శరీరంలోని ఇస్ట్రోజన్ స్థాయిలు అనేవి క్యాన్సర్ గ్రహకాలుగా పనిచేస్తాయి. కావున పుట్టిన బిడ్డకు పాలు ఇవ్వడం వలన హార్మోన్లు అనేవి సమతుల్యం చెంది ఈస్ట్రోజన్ స్థాయిలను నియంత్రిస్తుంది. అలాగే రొమ్ము క్యాన్సర్ భారిన పడకుండా కూడా చూస్తుంది. అయితే బిడ్డకు తల్లిపాలు ఇవ్వటం వలన డిఎన్ఏ అనేది దెబ్బతిన్న,రొమ్ము కణాజాలు అనేవి తొలగుతాయి. దీంతో క్యాన్సర్ ప్రభావం అనేది తగ్గుతుంది…
కన్నతల్లి బిడ్డకు పాలు ఇవ్వటం వలన తల్లి యొక్క రోగనిరోధక శక్తి కూడా ఎంతగానో పెరుగుతుంది. దీని వలన వ్యాధులు మరియు ఇన్ఫెక్షన్ నుండి శరీరాన్ని కాపాడుకోవచ్చు. అలాగే ఆడవాళ్ళల్లో రొమ్ము క్యాన్సర్ కు నోకియా కారణం అయిన కార్సినోజెన్ల అభివృద్ధి చెందటండమే నిపుణులు అంటున్నారు. అయితే తల్లి బిడ్డకు పాలు ఇవ్వటం వలన రొమ్ము కణజాలం అనేది బహిర్గతం కాకుండా ఉంటుంది. అందుకే క్యాన్సర్ ప్రమాదం కూడా తగ్గుతుంది. సాధార బిడ్డను కన్న తర్వాత కూడా కొంతమంది ఆడవాళ్లు బరువు పెరగటం సహజం. అయితే బిడ్డకు పాలు ఇవ్వడం వలన ఈ ఊబకాయ సమస్యను కూడా దూరం చేయవచ్చు. అలాగే జీవప్రక్రియ సక్రమంగా సాగటం వలన కూడా బరువు నిర్వహణ అనేది బాగుంటుంది. దీని వలన క్యాన్సర్ ప్రమాదం కూడా ఉండదు అని నిపుణులు అంటున్నారు…