Cactus Plant : మీ ఇంట్లో ఈ మొక్కను పెంచుతున్నారా..? అయితే మీ మంచి ఆరోగ్యం మీ సొంతం… ఆ మొక్క ఏమిటో తెలుసా.?
ప్రధానాంశాలు:
Cactus Plant : మీ ఇంట్లో ఈ మొక్కను పెంచుతున్నారా, అయితే మీ మంచి ఆరోగ్యం మీ సొంతం, ఆ మొక్క ఏమిటో తెలుసా
Cactus Plant : మన ఇంట్లో ఎన్నో రకాల మొక్కలను పెంచుతూ ఉంటాం. అయితే అందులో కొన్ని వాస్తు పరంగా పెంచుకుంటాం.. కొన్ని పూల మొక్కలు.. కొన్ని పండ్ల మొక్కలు రకరకాలుగా పెంచుతూ ఉంటాం.. అయితే కొన్ని మొక్కలు ఇంట్లో పెంచితే ఆరోగ్యానికి ప్రమాదమని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఆ మొక్క ఏమిటంటే దాని పేరు కాక్టస్.. ఈ మొక్క ఇంట్లో ఉంటే ఆరోగ్యానికి డేంజరట. ఈ కాక్టస్ లో ఓ విచిత్రమైన రకం ఉంది. ఆ మొక్కని ఒక వ్యక్తి పెంచుతున్నాడట. ఆ వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్ద కోడేపాక గ్రామానికి చెందిన కోమనేని రఘు అనే ప్రైవేట్ టీచర్ అరుదైన మొక్కలను పెంచడం తనకి అలవాటుగా మార్చుకున్నాడు. తమ ఇంటిని ప్రకృతి వనంలా మారుస్తాడు.
అక్కడ పెరుగుతున్న ప్రతి మొక్క ప్రత్యేకమైనవే ఎక్కడో దక్షిణాఫ్రికాలో ఎడారిలో పెరిగే ముళ్ళ మొక్కలు ఇక్కడ పెంచుతున్నాడు. ఈ మొక్కలకు రేడియేషన్ కంట్రోల్ చేసేందుకు శక్తి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తమ ఇంటి ఆవరణలో సుమారు 86 మొక్కలను పెంచుతున్నామని ఆయన చెప్పారు.. కాక్టస్ మొక్కల వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. అవి మొబైల్ నుంచి మరియు పరికరాల నుంచి వచ్చే రేడియేషన్ తగ్గించి గుణం ఈ మొక్కలకి ఉందట.. అలాగే ఈ కాక్టస్ మొక్కలకు పూసే పూలు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటాయట.
అయితే కొంతమంది కాక్టస్ లాంటి ముళ్ళ మొక్కలు ఇళ్లల్లో ఉండకూడదని ప్రజలను నమ్ముతున్నారు. అది ఒక బ్రమ అంటూ ఆయన తెలిపారు. మొక్కలను సేకరించడానికి చాలా సమయం పడుతుంది. కొన్ని సంవత్సరాల నుంచి వీటిని పెంచుతున్నానని ఆయన చెప్పారు. వెస్ట్ బెంగాల్ లో మరియు ఇతర దేశాల నుండి వీటిని తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. మనల్ని రేడియేషన్ నుంచి రక్షించే గొప్ప శక్తి ఏదైనా ఉంది అంటే ఈ మొక్క మాత్రమే అని ఆయన తెలుపుతున్నారు.. ఓల్డ్ మాన్ కాప్టస్ కాటన్ కాక్టస్, ఏజీ నోట్ చిప్స్, స్టార్ కాక్టస్, వన్ కాక్టస్, రౌండ్ కాక్టస్ఇలా ఎన్నో రకాల మొక్కలను ఆయన పెంచుతున్నట్లు తెలిపారు..