Milk : ఎండాకాలం పాలు తాగవచ్చా… నిపుణులు ఏమంటున్నారంటే…!
Milk : ప్రతి రోజు ఒక గ్లాస్ పాలు చాలా మంది తాగుతూ ఉంటారు. ఎందుకు అంటే. పాలు తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది కాబట్టి. పాలలో ఎన్నో పోషకాలు ఉంటాయి. పాలు తాగటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే. పాలు తాగటం వలన కండరాలకు బలాన్ని ఇస్తాయని చిన్నప్పటినుండి ఇప్పటివరకు కూడా మనం వింటూనే ఉన్నాం. అయితే వేసవిలో మాత్రం పాలు తాగటం వలన పొట్టకు వేడి చేస్తుంది అని, ఎండాకాలంలో […]
ప్రధానాంశాలు:
Milk : ఎండాకాలం పాలు తాగవచ్చా... నిపుణులు ఏమంటున్నారంటే...!
Milk : ప్రతి రోజు ఒక గ్లాస్ పాలు చాలా మంది తాగుతూ ఉంటారు. ఎందుకు అంటే. పాలు తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది కాబట్టి. పాలలో ఎన్నో పోషకాలు ఉంటాయి. పాలు తాగటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే. పాలు తాగటం వలన కండరాలకు బలాన్ని ఇస్తాయని చిన్నప్పటినుండి ఇప్పటివరకు కూడా మనం వింటూనే ఉన్నాం. అయితే వేసవిలో మాత్రం పాలు తాగటం వలన పొట్టకు వేడి చేస్తుంది అని, ఎండాకాలంలో పూర్తిగా పాలు తాగటం మానేసే వాళ్ళు కొందరు ఉన్నారు. ఈరోజు మనం వేసవిలో పాలు తాగటానికి సరైన మార్గం ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం…
ఆరోగ్య నిపుణుల అభిప్రాయ ప్రకారం చూస్తే. కడుపులో ఎసిడిటీని కలిగించే అవకాశం ఉండటం వలన ఖాళీ కడుపుతో పాలను ఎప్పుడు కూడా తాగకూడదు. ఖాలీ కడుపుతో మీరు ఎప్పుడైనా పాలు తాగినట్లయితే కచ్చితంగా దానితో పాటుగా ఏవైనా నడ్స్ తీసుకుంటే మంచిది. ఇది మీ కండరాలను బలంగా చేస్తుంది. వేసవిలో చల్లని పాలు తాగడంతో మీరు రోజును మొదలుపెట్టండి. ఎందుకంటే. వేసవిలో వేడి పాలు తాగటం వలన కడుపుకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువలన వేసవిలో వేడి పాలకు బదులుగా చల్లటి పాలు తీసుకోవడం మంచిది. ఇది శరీరాన్ని చల్లగా కూడా ఉంచుతుంది. చలికాలంలో గోరు వెచ్చని పాలు తాగాలి. ఇలా చేసినట్లయితే రోజంతా మీరు ఎనర్జిటిక్ గా ఉంటారు. వ్యాయామం చేసిన తర్వాత ఎక్ససైజ్ టైంలో పొరపాటున కూడా పాలు తాగకూడదు. అలా కాకుండా వ్యాయామం చేసిన తరువాత ఒక అరగంట సేపు ఆగి తరువాత మాత్రమే పాలు తాగాలి. ఇలా చేయటం వలన శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. మీకు జలుబు లేదా ఫ్లూ ఉన్నట్లయితే పొరపాటున కూడా చల్లటి పాలు తీసుకోకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో గోరు వెచ్చని లేక వేడి పాలు తాగటం మంచిది. దీనివలన మీరు గొంతు నొప్పి నుండి కూడా ఉపసమనం పొందుతారు.
మీకు రాత్రి పడుకునే ముందు పాలు తాగే అలవాటు ఉన్నట్లయితే, చలికాలంలో కచ్చితంగా గోరు వెచ్చని పాలను తాగాలి. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. చలి నుండి కూడా రక్షణ ఇస్తుంది. వేడి పాలు జీర్ణ సమస్యలు, గ్యాస్, కడుపునొప్పి ఇలాంటి సమస్యలకు దూరంగా ఉంచడంలో సహాయం చేస్తుంది. మీకు నిద్రలేమి సమస్య ఉన్నట్లయితే గోరువెచ్చని పాలు తీసుకుంటే మంచిది. పాలలో ఉన్న అమినో యాసిడ్లు, సెరోటోనిన్, మెలటోనిన్ ను తగ్గించి శరీరానికి నిద్రను దగ్గర చేస్తుంది. చల్లటి పాలు తాగటం వలన శరీరం అనేది క్యాల్షియం ను అధికంగా గ్రహిస్తుంది. అయితే నిద్రపోయే ముందు చల్లని పాలన తీసుకోకపోవడం మంచిది. ఇవి జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. మీకు జలుబు కనుక ఉన్నట్లయితే చల్లటి పాలు అస్సలు తాగకూడదు. దానివలన జలుబు, కఫం, దగ్గు వస్తుంది. పాలలో లాక్టోస్ అనేది పుష్కలంగా ఉంటుంది. అందుకే జీర్ణం కావటానికి చాలా టైమ్ తీసుకుంటుంది. అందుకే పాలను రాత్రి లేక ఉదయం తాగటం మంచిది. మధ్యాహ్నం టైం లో పొరపాటున కూడా పాలు తాగటం మంచిది కాదు అని అంటున్నారు నిపుణులు…